మైసూరు సంస్కృతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్రాఫోర్డ్ హాల్, మైసూరు విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయం.

మైసూరు కర్ణాటక రాష్ట్రంలోని నగరం. దీన్ని కర్ణాటక సాంస్కృతిక రాజధానిగా వ్యవహరిస్తారు.[1] శతాబ్దాల పాటు మైసూరు రాజ్యాన్ని పరిపాలించిన ఉడయార్లకు ఇది రాజధాని. వుడయార్లు కళలకు, సంగీతానికి గొప్ప పోషకులు. వీరు మైసూరును సాంస్కృతిక కేంద్రంగా మలచడంలో గొప్ప కృషి చేశారు.[2] మైసూరు మ్యూజియంలు, ఆర్ట్ గ్యాలరీలకు, దసరా సమయంలో సాగే పండుగలు, ఉత్సవాలకు సుప్రసిద్ధం, ఇవి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల్ని ఆకర్షిస్తాయి. మైసూరు దోసె, మైసూర్ పాక్ వంటి వంటకాల పేరు నగరం పేరుమీదుగా వచ్చింది. ప్రముఖ చీరలైన మైసూరు సిల్క్ చీరలకు ఇక్కడ నుంచే ఆవిర్భవించాయి. మైసూరు చిత్రకళ అన్న ఓ ప్రత్యేక చిత్రకళా విభాగానికి కేంద్రంగా నిలిచింది.

Notes[మార్చు]

  1. The Correspondent. "Goodbye to old traditions in 'cultural capital'". Online Edition of The Deccan Herald, dated 2006-03-17. 2005, The Printers (Mysore) Private Ltd. Archived from the original on 2007-02-05. Retrieved 2016-10-20.
  2. Contribution of Wodeyar kings to the art and culture of Mysore city is discussed by Shankar Bennur. "Dasara on canvas". Online Edition of The Deccan Herald, dated 2006-09-26. 2005, The Printers (Mysore) Private Ltd. Retrieved 2007-04-04.