మొగ్డుంపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

       

మొగ్డుంపల్లి నల్గొండ జిల్లా ఉన్న ఒక పల్లెటూరు తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాద్ నుండి 45 కిలోమీటర్ దూరంలో ఉంది, బీబీనగర్ కి 4.5 కిలోమీటర్ దూరం లోను భువనగిరికి 8.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల పల్లెటూరు. మొగ్డుం పల్లి వూరికి ఒక ఫర్లంగ్ దూరంలో బీబీనగర్ నుండి వచ్చే వాగు ఉంటుంది 25 యేండ్లక్రితం ఆ నది బాగా నీళ్ళతో నిండి ఉండేది. ఆ వూరికి సగం కిలోమీటర్ దూరంలో గొల్లగూడెం ఉంది అక్కడ ఎక్కువ శాతం గొల్ల వారి నివసిస్తారు అక్కడ చాల కొద్దిమంది నివసిస్తారు 25 నుండి 30 ఇండ్ల వరకు మాత్రమే ఉంటాయి అక్కడ ఒక టెంపుల్ ఉంది అదే నరసింహా స్వామి దేవాలయం ప్రతి ఏడాది అగ్నిగుండాలు అని జాతర అవుతుంది ఆ దేవాలయ బాగోగులు అక్కడ ఉన్న గొల్ల కులానికి సంబదిత కార్యకర్తలు నిర్వహిస్తారు.

ఇక మొగ్డుం పల్లి 200 పైగా కడప ఉంటుంది వూరికి మద్యలో పంచాయతి కార్యాలయం ఉంటుంది ఆ ఆఫీసు ముంది పెద్ద రాయి చెట్టు ఊరిలోని అందరు సాయంకాలం సమయంలో ఆ చెట్టుక్రింద కూర్చొని ముచ్చట్లు పెడతారు అంతేకాదు వూరిలో ఎ పంచాయతి వచ్చిన అక్కడే చర్చలు జరిగుతాయి. ఆ వూరికి తూర్పు దిక్కున వాగు ( యేరు కతువా ) ఆనకట్టు ఉంది అక్కడ నీటిని నిల్వచేసి పంట పొలాలకు పంపుతారు. ఆనకట్ట క్రింద ఆ ఊరిలోని యువత చేపలను పడతారు. ఇక ఆ వూరికి పడమర ప్రాథమిక పాఠశాల ఉంది దాదాపుగా ఆ ఊరిలోని వారందరూ ఆ పాఠశాల లోనే చదివేవారు ఆ స్చూల్కి ఎడమ వైపు వూరి దేవత దేవాలయం ఉంది ప్రతి రెండు యేండ్లకు ఒక్కసారి జాతహర అవుతుంది ఆ పండుగకు మాత్రం ఆ ఊరిలోనూ వారందరూ కొత్త బట్టలు, ఇంటి ఆడపడుచులను పిలిచి వారికి భోజన తాంబూలాలు ఇచ్చే ఆనవాయితీ వస్తుంది . వూరికి దక్షణ బాగాన రాయిపహాడ్ అనే వూరి ఉంది మొగ్డుమ్పల్లి నుండి మొదలుకొని రాయిపాహాద్ వారకు అన్ని చేలకలు పొలాలు ఉంటాయి . వూరికి ఉత్తరం భాగంలో ఉంది వాగు ఆ వాగు 365 లోజులు పారే వాగు కాలక్రమేనా ఎండిపోయింది. పూర్వ కాలంలో ఈ వాగుని చూసి ఆ వూరి మగవారికి పిల్లను కూడా ఇవ్వని సంఘటనలు ఉన్నాయంటే అతిశయోక్తి లేదు.