Jump to content

మొవ్వు

వికీపీడియా నుండి

ఏక కాండ మొక్కలకు, ఏక కాండ చెట్లకు మొవ్వు తల భాగంలో ఉంటుంది.

అల్లం మొవ్వు

ఏక కాండ గడ్డి మొక్కలు

[మార్చు]

ఈ మొవ్వు ఆకు రూపంలో బయటికి వస్తుంది.

మొవ్వు తెలుపు రంగులో ఉంటుంది.

మొవ్వు రుచిగా ఉంటుంది.

వరి, మొక్కజొన్న వంటి మొక్కలకు మొవ్వు ఉండే చోట చీడ పురుగులు పడితే దానిని మొవ్వు తెగులు అంటారు.

ఏక కాండ చెట్లు

[మార్చు]

ఈ చెట్ల యొక్క ఆకులు ఆకు రూపాన్ని సంతరించుకొన్నేందుకు మునుపు ఒక తెల్లని గడ్డ రూపంలో చెట్టు యొక్క తల భాగంలో ఉంటుంది. దీనిని మొవ్వు అని అంటారు.

తాటిచెట్టు, కొబ్బరిచెట్టు, ఈతచెట్టు వంటి చెట్లను నరికి నప్పుడు తల భాగంలో ఉండే మొవ్వును మనుషులు ఇష్టంగా తింటారు.

మొవ్వు రుచిగా ఉంటుంది.

మొవ్వులోని కొంత భాగం తీయగాను, కొంత భాగం వగరు గాను, కొంత భాగం ఉప్పగాను ఉంటుంది.

మొవ్వును నమిలి పుక్కిటబట్టిన నోటిపూత మానును.

ఈత మొవ్వు నలుగగొట్టి వరబీజమునకు కట్టిన తగ్గిపోవునని కొందరి అభిప్రాయం.

మొవ్వును అధికంగా తినుట వలన నష్టాలు

[మార్చు]

మొవ్వును ఎక్కువగా తినుట వలన వాతము జేయును, కీళ్ళలోని పట్టువిడ గొట్టును, కొందరికి మోర్లుకట్టును.

"https://te.wikipedia.org/w/index.php?title=మొవ్వు&oldid=3284577" నుండి వెలికితీశారు