Jump to content

మోజెస్ వంతెన

వికీపీడియా నుండి
మోజెస్ వంతెన
1751 లో ఫోర్ట్ డి రూవెర్.

మోజెస్ వంతెన నెదర్లాండ్స్ దేశంలోని హల్స్‌టెరెన్‌లో ఫోర్ట్ డి రూవెర్ లో కట్టబడిన ఒక అద్భుత వంతెన. దీని నిర్మాణ శైలి వలన ఇది కొలనును రెండుగా విడదీయబడునట్లు కనబడుతుంది.[1]

విశేషాలు

[మార్చు]
  • ఈ కొలను వైపు హఠాత్తుగా చూస్తే అక్కడున్న వారంతా మునిగిపోతున్నారా? అన్న సందేహం వస్తుంది. లేదా వంతెనను ముంచెత్తేలా నీళ్లు పొంగిపొర్లుతున్నాయనుకుంటాం. దగ్గరకి వెళితే తప్ప తెలియదు నీళ్ల మధ్య కట్టిన వంతెన నిర్మాణమే అలా ఉందని.
  • ఈ వంతెన ఇప్పటిది కాదు. 17వ శతాబ్దం నాటిది. అప్పట్లో కోట చుట్టూ కందకాలు ఏర్పాటు చేసేవారు. లోతైన ఈ నీటిని దాటడానికి పడవలు వేసుకుని వెళ్లడానికి వీలు ఉండేది కాదు. అలాఅని మామూలుగా దాటలేం. అలాగే శత్రు సైనికులను రాకుండా చేయడానికి భిన్నంగా ఆలోచించి ఇలా ఈ అదృశ్య వంతెనను నిర్మించారు. కోటలో దిగుతున్న మెట్లలా ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డును కలుపుతూ నీటి మధ్యలో ఉంటుంది. నీటిని రెండుగా చీలుస్తుంది.
  • నీటికి పాడవకుండా ఉండేలా ఈ వంతెనను అకోయా అనే ప్రత్యేకమైన కలపతో కట్టారు. నీటిలో తడిసి ఉబ్బిపోవడం, నాచు పట్టడం వంటివి జరగకుండా సరైన జాగ్రత్తలు తీసుకున్నారు.
  • 19వ శతాబ్దంలో మరికొన్ని మార్పులు చేసి వంతెనను మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.
  • నీటి మధ్య నడిచిన అనుభూతిని పొందాలనుకునే వారెంతోమంది ఇక్కడికి వచ్చి తమ సరదా తీర్చుకుంటారు.

మూలాలు

[మార్చు]
  1. ""Sunken Pedestrian Bridge in the Netherlands Parts Moat Waters Like Moses!"". inhabitat.com/. inhabitat. 23 October 2014. Retrieved 11 February 2015.

బయటి లంకెలు

[మార్చు]