మోత కర్రలు

వికీపీడియా నుండి
(మోత ఊడలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

బరువుగా ఉన్న ఒక వస్తువును కొంతమంది కలిసి ఆ వస్తువు మోయడానికి ఉపయోగించిన కర్రలను మోతకర్రలు అంటారు.


మోతకర్రల లక్షణాలు[మార్చు]

మోతకర్రల పరిమాణం ఎక్కువగా ఉన్నా బరువు తక్కువగా ఉండాలి.

మోతకర్రలు చక్కగా పొడవుగా ఉండాలి.

మోతకర్రలు నునుపుగా ఉండి మోసే వారికి అనుకూలంగా ఉండాలి.

ఈ కర్రలపై ఎక్కువ బరువు పడినప్పటికి అవి విరగకుండా తట్టుకొని ఉండగలగాలి.

ఇవి తొందరగా చెడిపోకుండా ఎక్కువకాలం నిలువ వుండగలగాలి.

ఈ కర్రలు జంపింగ్ ఇస్తున్నప్పటికి ఈ జంపింగ్ మోసే వారికి అనుకూలంగా ఉండాలి.

మర్రి ఊడలు[మార్చు]

బలంగా ఎదిగిన మర్రి చెట్టు ఎత్తుగా ఉన్న తన శాఖల నుండి ఊడలు అనబడే తన కొమ్మ వేర్ల ద్వారా భూమిలోనికి పాతుకొని బలంగా తయారవుతాయి.

ఈ విధంగా భూమిలోనికి పాతుక్కున్న మర్రి ఊడలు కొన్ని దశాబ్దముల తరువాత లావుగా తయారవుతాయి.

లావుగా తయారైన ఈ మర్రి ఊడలను నరికి మోత మోయడానికి ఉపయోగిస్తారు. ఈ విధంగా మోయడానికి అనుకూలంగా తయారు చేసుకున్న మర్రి ఊడలను మోత ఊడలు లేక మోత కర్రలు అని అంటారు.

దేవాలయాలలో మోత ఊడలు[మార్చు]

దేవాలయాలలో వివిధ వాహనాలపై ఉత్సవ విగ్రహాలకు గ్రామోత్సవాన్ని నిర్వహించేటప్పుడు మోత కర్రలుగా తేలికగా బలంగా ఉండే మోత ఊడలను ఉపయోగిస్తారు.

దేవాలయాలలో ఎక్కువగా వాడే మోత ఊడల పొడవు 16 నుంచి 24 అడుగుల పొడవు కలిగి ఉంటాయి.

ఉత్సవ విగ్రహాలకు గ్రామోత్సవాన్ని నిర్వహించేటప్పుడు రెండు సమాన పొడవు గల మోత ఊడలను ఉపయోగిస్తారు. కొన్ని సందర్భాలలో మరింత ఎక్కువ బరువు ఉన్న వాహన సేవల సమయంలో మరింత ఎక్కువ మంది మోతవారు అవసరమయ్యే సందర్భాలలో నాలుగు మోతకర్రలను ఉపయోగిస్తారు.తీసుకోవాల్సిన జాగ్రత్తలు[మార్చు]

మోతకర్రలుగా మోత ఊడలను ఉపయోగించే ముందు వీటికి అనేక పరీక్షలు చేయవలసి ఉంటుంది.

దేవాలయాలలో మోత ఊడలను ఉపయోగించే ముందు వాటికి కొన్ని రకాల పూజలను చేయవలసి ఉంటుంది.


ఇవి కూడా చూడండి[మార్చు]

హంస పాదు