Jump to content

హంసపాదు

వికీపీడియా నుండి
(హంస పాదు నుండి దారిమార్పు చెందింది)

దేవాలయాలలో జరిగే ఉత్సవాల సమయంలో ఉత్సవ మూర్తులకు వివిధ వాహనాలపై గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు.

గ్రామోత్సవ సమయంలో వాహనాన్ని కొంతమంది భక్తులు తమ భుజంపై మోస్తూ ఉంటారు.

గ్రామోత్సవం జరుగుతున్నంత సేపు వాహన బరువు మోతాన్ని తమ భుజముపై ఉంచడం చాలా కష్టం కాబట్టి కొంత వెసులు బాటు కోసం ఏర్పరచుకున్న పరికరాన్ని హంసపాదు అంటారు.

హంసపాదు T, Y ఆకారానికి మధ్యస్తంగా ఉంటుంది.

వాహనసేవ జరిగే సమయంలో వాహనాన్ని సరిగా నిలబెట్టేందుకు 4 నుంచి 8 హంసపాదులు అవసరమవుతాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

[మార్చు]

హంసపాదును వేసేటప్పుడు చేతులు, కాళ్ళు వాటి మధ్యన పడి నలిగే అవకాశం ఉన్నందున వాటిని వేసే వ్యక్తి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

హంసపాదును వేసినప్పుడు అది సరిగా ఉందో లేదో సరి చూసుకుని సరిగా లేకపోతే సరి చేసుకోవాలి.

హంసపాదు వేసి నిలిపిన వాహనాన్ని మళ్ళీ ముందుకు నడిపించవలసినప్పుడు అందరిని హెచ్చరించవలెను. (ఉదాహరణకు గోవిందా, శ్రీనివాసా, చెన్నకేశవా అని)


ఇవి కూడా చూడండి

[మార్చు]

మోత ఊడలు

"https://te.wikipedia.org/w/index.php?title=హంసపాదు&oldid=2886135" నుండి వెలికితీశారు