మోరన్ భాష

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మోరన్
మాట్లాడే దేశాలు: భారతదేశం 
ప్రాంతం: అస్సాం
మాట్లాడేవారి సంఖ్య:
భాషా కుటుంబము: Sino-Tibetan
 సాల్
  బోడో-గారో
   బోడో
    మోరన్
భాషా సంజ్ఞలు
ISO 639-1: none
ISO 639-2:
ISO 639-3: none


మోరన్ ( మోరాన్ ) అనేది అంతరించిపోయిన బోడో-గారో భాష, ఈశాన్య భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో ఈ భాష ఉపయోగంలో ఉండేది. ఈ భాష టిన్సుకీయ జిల్లాలోని దిమాసా తెగ వారికి సంభదించినది. మోరాన్ అంటే 'అటవీ నివాసి' అని అర్థం.

మోరాన్ తెగకి చెందిన ప్రజలు 13 వ శతాబ్దంలో బ్రహ్మపుత్ర నదికి ఆగ్నేయ దిశలో నివసించేవారని చరిత్ర తెలుపుతుంది. జనాభా లెక్కల ప్రకారం మోరాన్ భాష మాట్లాడే వారు 1901 లో 78 మంది, 1911 లో 24 మంది ఉండగా 1931 సంవత్సరానికి ఈ భాష తెలిసిన వారు జన గణనలో లేరని తెలుస్తుంది. ఈ భాష యొక్క ఏకైక మూలం 1904లో PR గుర్డాన్ రాసిన కథనంలో ఉంది. [1] [2] ఈ భాష మాట్లాడే వారు రాను రాను అస్సామీ భాషకు మారినట్లు గ్రహించవచ్చు.

కుటుంబం

[మార్చు]

తల్లి - ఆయి

తండ్రి - ఆబాయి

మనిషి - సదాయి

స్త్రీ - సాయిసి

అబ్బాయి - సదైరా

అమ్మాయి - సాయిసిర

తాత - డ్యూటా

నాన్నమ్మ - ఆబోయి

గౌరవనీయుడు/స్నేహితుడు - ఓయ్ యు

వ్యక్తి - సదాయి

పెద్ద వ్యక్తి - సదైరా

సంఖ్యలు

[మార్చు]

1 - సే

2 - నె

3 - సామ్

4 - బీరి

5 - బాహా

6 - డు

7 - సినీ

8 - సాక్

9 - సాకు (జి-ఖో)

10 - టి

మూలాలు

[మార్చు]
  1. Jacquesson 2017: "A second more dramatic example is P.R. Gurdon’s 1904 article 'The Morans' in the same journal. ... The census returned 78 speakers in 1901, 24 in 1911 and none in 1931. Gurdon’s article is thus the only source for this extinct language."
  2. Error on call to Template:cite paper: Parameter title must be specified

బాహ్య లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మోరన్_భాష&oldid=3921642" నుండి వెలికితీశారు