Jump to content

మ్యాన్ ఆఫ్ ది హోల్

వికీపీడియా నుండి
మ్యాన్ ఆఫ్ ది హోల్
జననం1960వ దశకం
మరణం2022 ఆగస్టు 23
బ్రెజిల్‌ పశ్చిమ ప్రాంతం రోండోనియా రాష్ట్రం అమెజాన్‌ అడవులు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
టనారు ఆదివాసీ తెగలోని చివరి వ్యక్తి

మ్యాన్ ఆఫ్ ది హోల్ (ఆంగ్లం: Man of the Hole) అని పిలువబడే వ్యక్తి బ్రెజిల్ లోని టనారు ఆదివాసీ తెగలోని చివరి వాడు. 2022 ఆగస్టు చివరలో ఇతని మరణంతో ఇక ఆదివాసీ తెగ పూర్తిగా అంతరించిపోయిందని బ్రెజిల్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.[1]

చరిత్ర

[మార్చు]

70వ దశకంలో రోండోనియా రాష్ట్రంలోని టనారు ఆదివాసీ ప్రాంతంలోని అటవీభూముల్లో భూస్వాములు తమ పొలాలను విస్తరించుకునేందుకు అరుదైన తెగకు చెందిన వారిని మట్టుపెట్టారు. ఆ తర్వాత కూడా 1995లో అక్రమ గనుల తవ్వకందారులు ఈ తెగకు చెందిన మరికొందరిని అంతమొందించారు. ఈ క్రమంలో ఆ తెగలో ఒకే ఒక్క వ్యక్తి మిగిలాడు. అతడి పేరేమిటో ఎవరికీ తెలియదు. కానీ అతడు ఉండే ప్రాంతాన్ని బ్రెజిల్ ప్రభుత్వం ఇతరులకు నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించింది. అంతేకాకుండా అతను సంచరించే ప్రాంతాలను బ్రెజిల్ అధికారులు నిత్యం పర్యవేక్షిస్తుండేవారు. అతను ఆహారవేటలో భాగంగా గోతులు తవ్వి వాటిలో పడే జంతువులను భక్షిస్తుండేవాడు. అందుకని అతడికి 'మ్యాన్ ఆఫ్ ది హోల్' అని పేరు వచ్చింది.

సుమారు 60 ఏళ్ల వయసున్న మ్యాన్ ఆఫ్ ది హోల్ గత 26 ఏళ్లుగా ఒంటరిగానే జీవిస్తున్నాడు. కాగా 2022 ఆగస్టు 24న రోజువారీ పరిశీలన చేపట్టిన ఉద్యోగికి ఆ వ్యక్తి విగతజీవుడిలా దర్శనమిచ్చాడు.[2] తనకు మరణం ఆసన్నమైందని తెలుసుకున్న ఆ వ్యక్తి శరీరంపై ఈకలు కప్పుకుని ఉండడం గమనార్హం.[3]

మూలాలు

[మార్చు]
  1. "Brazil: మానవజాతిలో ఓ అరుదైన ఆదివాసీ తెగ కనుమరుగు." web.archive.org. 2022-08-30. Archived from the original on 2022-08-30. Retrieved 2022-08-30.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. Buschschlüter, Vanessa (29 August 2022). "Last member of indigenous tribe dies in Brazil after resisting contact for decades". BBC News. British Broadcasting Corporation (BBC). Archived from the original on 29 August 2022. Retrieved 29 August 2022.
  3. Valente, Rubens (27 August 2022). "Símbolo da resistência dos indígenas isolados no país, "índio do buraco" é achado morto" [Symbol of the resistance of isolated indigenous people in the country, "Indian of the Hole", is found dead] (in బ్రెజీలియన్ పోర్చుగీస్). Agência Pública. Archived from the original on 27 August 2022. Retrieved 27 August 2022.