యంగ్ ఇండియా
Appearance
యంగ్ ఇండియా ఒక వార పత్రిక. దీనిని ఇంగ్లీషులో 1919 నుండి 1932 వరకు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ప్రచురించాడు.[1] ఈ పత్రికలో గాంధీజీ స్పూర్తినిచ్చే అనేక సుభాషితాలు రాశారు. అతను తన ఏకైక సిద్ధాంతాన్ని వ్యాప్తి చేయడానికి, ఉద్యమాల నిర్వహణలో అహింసా మార్గం యొక్క ఉపయోగాలను తెలిపేందుకు, బ్రిటన్ నుండి భారతదేశం తుది స్వాతంత్ర్యం కోసం ప్రణాళికలా పాఠకులను పురికొల్పుటకు యంగ్ ఇండియాను ఉపయోగించారు.
మహాత్మా గాంధీ వృత్తి రీత్యా న్యాయవాది అయినా సమాజసేవకు మొగ్గు చూపాడు. సమాజ సేవకుడిగా, రాజకీయ కార్యకర్తగా తన భావాలను ప్రజలకు చేరవేయడానికి పత్రికల ప్రాధాన్యతను గుర్తించాడు. పత్రిక ప్రారంభించినప్పటి నుంచి 1922 లో తాను జైలుకు వెళ్ళేవరకు వందలకొద్దీ వ్యాసాలు రాశాడు. ప్రెస్సులు మూత పడిగా ప్రతులను చేతిరాతతో కాపీ చేయమని ఆయన పత్రికా కార్మికులను ప్రోత్ర్సహించాడు.[1]
మూలాలు
[మార్చు]వికీమీడియా కామన్స్లో Young Indiaకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- ↑ 1.0 1.1 The Story Of Our Newspaper. National Book Trust. 1996.