యతి (ఒక వింత జీవి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Yeti
(Abominable Snowman
Migoi, Meh-teh et al.)
Yetiscalp.JPG
Purported Yeti scalp at Khumjung monastery
Grouping Cryptid
Sub grouping Hominid
Country Nepal, Bhutan,[1] China, India, Mongolia, Russia[2]
Region Himalayas
Habitat Mountains

హిమాలయ ప్రాంతంలో యతి అనే వింత జీవులు సంచరిస్తున్నాయని చాలా మంది చెబుతూ ఉంటారు. అయితే ఇది నిజమా లేక వట్టి పుకారేనా అన్నది నిర్ధారణ కాలేదు. మనిషి కోతి కలగలిసి నట్లుండే భీకర ఆకారంతో యతి ఉంటుందని హిమాలయాలలో నివసించె షెర్ఫాలు చెబుతూ ఉంటారు. అయితే పెద్దపెద్ద పాదముద్రలు మంచు మీద కనిపించడంతో యతి లేదన్న విషయం కొట్టి పడేయడానికి వీల్లేకుండా ఉంది. ఆడ యతులు మగ వాళ్ళని, మగ యతులు ఆడ వాళ్ళని ఎత్తుకెళ్ళి పోయి తమ కోర్కెలు తీర్చు కుంటాయని కూడా షెర్ఫాలు చెబుతుంటారు. హిమాలయాల్లోని మకాలూ పర్వతాన్ని అధిరోహించిన ఇటలీ పర్వతారోహకుడు మెస్నర్ తాను యతిని చూసానని చెప్పడంతో...యతులు ఉన్నాయేమోననిపిస్తోంది. డాన్ విలియమ్స్క్ష్ అనే మరో పర్వతారోహకుడు కూడా తాను హిమాలయాల్లొని అన్నపూర్ణా శిఖరాన్ని అధిరోహిస్తున్నపుడు బైనాక్యులర్ లో యతిని చూసానని చెప్పాడు. అయితే టెన్సింగ్ నార్కేతో కలిసి తొలిసారి ఎవరెస్ట్ ని ఎక్కిన ఎడ్మండ్ హిల్లరీ మాత్రం యతి ఉన్నది అన్న మాటని కొట్టి పడేస్తున్నాడు. కనిపించిన పాదముద్రలు మనుష్యులవేనని మంచు కరగటం వల్ల అవి వ్యాకోచించి ఉంటాయని అభిప్రాయపడ్డాడు. విస్తృతమైన పరిశోధనలు జరిగితే కానీ యతి ఉన్నదా? లేదా అన్నది తేలటం కష్టం.

మూలాలు[మార్చు]

  1. Sullivan, Tim (10 August 2008). "Losing the yeti in the forgotten nation of Butan". The Victoria Advocate. 
  2. Bigfoot Files, Channel 4 (UK TV), November 2013

ఇతర లింకులు[మార్చు]