యదునాథ్ థత్తే
Appearance
యదునాథ్ థత్తే | |
---|---|
జననం | యెయోలా, నాశిక్ జిల్లా, మహారాష్ట్ర | 1922 అక్టోబరు 5
మరణం | 1998 మే 10 | (వయసు 75)
వృత్తి | భారత స్వాతంత్ర్య సమరయోధుడు, పాత్రికేయుడు, సంపాదకుడు |
యదునాథ్ దత్తాత్రేయ్ థత్తే ( 1922 అక్టోబరు 5 - 1998 మే 10) మరాఠీ పాత్రికేయుడు, సంపాదకుడు, సామాజిక కార్యకర్త, సామ్యవాద నాయకుడు.[1][2]
జననం
[మార్చు]యదునాథ్ దత్తాత్రేయ్ థత్తే 1922, అక్టోబరు 5న మహారాష్ట్ర, నాసిక్ జిల్లాలోని యెయోలాలో జన్మించాడు. మహారాష్ట్ర నుండి భారత స్వాతంత్ర్య ఉద్యమంలో నాయకులలో ఈ యదునాథ్ ఒకరు. 1944లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్ని ఆరు నెలల జైలు శిక్షను అనుభవించాడు.[2]
వృత్తిరంగం
[మార్చు]1956 నుండి 1982 వరకు సాధన అనే సోషలిస్ట్ వారపత్రికలో, రాష్ట్ర సేవాదళంలో సుదీర్ఘకాలం పనిచేశాడు.[2]
రచనలు
[మార్చు]హోమీ జహంగీర్ భాభా, నీల్స్ బోర్, సివి రామన్, ఎర్నెస్ట్ ఆర్. ఫోర్డ్, సతీష్ చంద్ర దాస్‌గుప్తా, జగదీష్ చంద్ర బోస్ మొదలైన ముఖ్య వ్యక్తుల జీవిత చరిత్రలతోపాటు, పలు పుస్తకాలు రాశాడు:
- మస్తకి హిమాలయ, అంతరంగి అంగర (1990)
- కోర్ ఫారర్ (1990)
- ఫులాటే నిఖారా (1980)
- సదానంద్ (1978)
- సరహద్ద గాంధీ (1969)
- అపల మనా, అపల అభిమాన (1966)
- అక్షయపాత్ర (1962)
- గహినా
మరణం
[మార్చు]యదునాథ్ దత్తాత్రేయ్ థత్తే 1988, మే 10న మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ Saha, Muralidhara Ba (2004). Yadunatha Thatte : savyasācī patrakāra va samājasevaka (in మరాఠీ). Mumbai: Maharashtra Rajya Sahitya ani Sanskriti mandal. OCLC 57393876.
- ↑ 2.0 2.1 2.2 "Socialist leader Thatte dead". Indian Express. 1998-05-11. Retrieved 2021-09-03.[permanent dead link] ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "IE" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు