యనమలవారిపల్లె
స్వరూపం
యనమలవారిపల్లె , తిరుపతి జిల్లా, యెర్రావారిపాలెం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
ఇటిమరపు రజని
[మార్చు]ఈ గ్రామానికి చెందిన ఈమె తండ్రి రమణాచారి ఒక వడ్రంగి. తల్లి తులసి గృహిణి. వీరిది రెకాడితేగానీ, డొక్కాడనికుటుంబం. 2016 ఒలింపిక్స్ హాకీ పోటీలలో, మన రాష్ట్రం నుండి పాల్గొన్న ఏకైక తెలుగు మహిళ. ఈమె 2016, నవంబరు-5న సింగపూరు నగరంలో నిర్వహించిన ఆసియా మహిళల హాకీ ఛాంపియన్ షిప్పు పోటీలలో తొలిసారిగా విజేతగా నిల్చిన భారత జట్టులో, గోల్ కీపరుగా తన ప్రతిభ ప్రదర్శించి, ఛైనా జట్టుకే పెద్ద అడ్డుగోడగా నిలిచి, మన జట్టుకి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది.
మూలాలు
[మార్చు]వెలుపలి లింకులు
[మార్చు]ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |