యమునా ప్రసాద్ శాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యమునా ప్రసాద్ శాస్త్రి
జననం(1927-06-16)1927 జూన్ 16
మరణం1997
వృత్తిభారత స్వాతంత్ర్య సమరయోధుడు, లోక్‌సభ మాజీ సభ్యుడు.
జీవిత భాగస్వామిసుశీల దేవి
పిల్లలుఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు

యమునా ప్రసాద్ శాస్త్రి[1] భారత స్వాతంత్ర్య సమరయోధుడు, లోక్‌సభ మాజీ సభ్యుడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రివా నియోజకవర్గంనుండి ఎన్నికయ్యాడు. భారతీయ లోక్‌దళ్ సభ్యుడిగా ఉన్న యమునా ప్రసాద్ అటు తరువాత జనతా పార్టీలో చేరాడు. మధ్యప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా కూడా పనిచేశాడు.[2] 1955లో వింధ్య ప్రాంతంలో భూస్వామ్య అణచివేతకు వ్యతిరేకంగా కిసాన్ ఉద్యమంలో గోవా లిబరేషన్ ఉద్యమంలో, మధ్యప్రదేశ్‌లోని సుర్గుజా, షాహడోల్ బొగ్గు గనులలో ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో పాల్గొన్నాడు, పోర్చుగీస్ పోలీసుల దాడిలో తన కుడి కంటిచూపును కోల్పోయాడు. తరువాత 1975, మార్చిలో పూర్తిగా అంధుడయ్యాడు.[3] యమునా ప్రసాద్ జ్ఞాపకార్థంగా అనేక పాఠశాలలు, కళాశాలలు నెలకొల్పబడ్డాయి.[4]

జననం, విద్యాభ్యాసం[మార్చు]

యమునా ప్రసాద్ 1927, జూన్ 16న మధ్యప్రదేశ్ రాష్ట్రం, రీవా జిల్లాలోని సుర గ్రామంలో జన్మించాడు. తండ్రి వింధేశ్వరి ప్రసాద్. యమునా ప్రసాద్ ఎంఏ, ఎల్.ఎల్.బి. పూర్తిచేశాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

యమునా ప్రసాద్ కు సుశీల దేవితో 1939, జూన్ 20 వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.

భారత స్వాతంత్ర్యోద్యమం[మార్చు]

యమునా ప్రసాద్ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. మంగవాన్, రేవాలోని పోస్టాఫీసుకు నిప్పు పెట్టిన ఆరోపణలో చిక్కుకున్నాడు, పోలీసుల నుండి లాఠీ ఛార్జ్ ఎదుర్కొన్నాడు;

రాజకీయ జీవితం[మార్చు]

1946—48 మధ్యకాలంలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ సభ్యుడిగా; 1948—52 మధ్యకాంలలో జనరల్ సెక్రెటరీగా; 1953-63 మధ్యకాలంలో ప్రజా సోషలిస్ట్ పార్టీ జనరల్ సెక్రెటరీగా; 1973—76 మధ్యకాలంలో సోషలిస్టు పార్టీ ఛైర్మన్ గా; 1977, 1980-86లో జనతా పార్టీ చైర్మన్ గా; 1989లో జనతాదళ్ పార్లమెంటరీ బోర్డు ఛైర్మన్ గా పనిచేశాడు.[5]

ప్రజాప్రతినిధిగా[మార్చు]

1962—67, 1967—72 మధ్యకాలంలో మధ్యప్రదేశ్ శాసనసభ్యుడిగా... 1977-79 మధ్యకాలంలో ఆరవ లోక్‌సభకు సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.

పదవులు[మార్చు]

  1. 1964—69: మధ్యప్రదేశ్ శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడు
  2. 1972-73: మధ్యప్రదేశ్ శాసనసభ అంచనాల కమిటీ, ఛైర్మన్
  3. 1990, జనవరి 19: 6 వ లోక్‌సభ అధికారిక భాష కమిటీ సభ్యుడు

మరణం[మార్చు]

యమునా ప్రసాద్ 1997లో మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. "Unseen India On The Eve Of Elections". archives.peoplesdemocracy.in. Archived from the original on 24 సెప్టెంబరు 2017. Retrieved 1 September 2021.
  2. Members Bioprofile[permanent dead link]
  3. XI LOK SABHA DEBATES, Session V (Monsoon)
  4. indcareer.com. "Yamuna Prasad Shastri College, Semaria". IndCareer.com (in ఇంగ్లీష్). Retrieved 1 September 2021.
  5. "Members Bioprofile". loksabhaph.nic.in. Retrieved 1 September 2021.