Jump to content

యర్నాగుల సుధాకర రావు

వికీపీడియా నుండి
యర్నాగుల సుధాకర రావు
జననంయర్నాగుల సుధాకర రావు
నివాస ప్రాంతంఆముదాలవలస,ఆంధ్రప్రదేశ్, ఇండియా
ఇతర పేర్లుశ్రీ భయంకర్
వృత్తిరచయిత
మతంహిందూ

యర్నాగుల సుధాకర రావు ప్రముఖ డిటెక్టివ్ నవలా రచయిత. ఈయన కలం పేరు శ్రీ భయంకర్. 1971 వ సంవత్సరం నుండి ఈయన రచనలు ప్రాచుర్యం పొందాయి. ఈయన రాసిన డిటెక్టివ్ నవలలు శ్రీ భయంకర్ అన్న కలం పేరుతో ప్రచురితమయ్యి సాహిత్య లోకాన్ని కట్టిపడవేసాయి.

యర్నాగుల సుధాకర రావు గారు ఇప్పటి వరకు సుమారుగా డిటెక్టివ్, జానపద, హర్రర్ నవలలు 338 వరకు రాసారు. అందులో చాలా వరకు పునర్ముద్రణకు వచ్చాయి. వివిధ వార మాస పత్రికలకు, వేల సంఖ్యలలో కథలు రాసారు. మూడు నాటికలు కూడా రాసారు.


ఈయన రాసిన శవంతోపెళ్ళి అనే నాటిక వందాలాది ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈయన 1974 లో పత్రికా రంగంలో కూడా అడు పెట్టారు. దిన పత్రికల ఆదివారం సంచికలకు నేర గాథలను రాసారు. 1995 లో మీరు జర్నలిస్టు కావచ్చూ అనే పుస్తకాన్ని గ్రామీణ విలేఖరుల కోసం రాసారు. ఈయన బి.కాం. వరకు చదువు కున్నారు. ఈయన నవలలే కాక ఇప్పటి వారికి సులభంగా అర్ధమయ్యే విధంగా అక్బర్ - బీర్బల్ కథలు, పరమానందయ్య శిష్యుల కథలు, తెనాలి రామకృష్ణ కథలు; మొదలగు కథలు రాసారు.


1971 వ సంవత్సరం ఒక సంఘటన ఆధారంగా ఈయన కథలు రాయడం మొదలు పెట్టారు. ఈయనకు తెలిసిన అమ్మాయి ఎవరొ ద్రోహం చేసారని పురుగుల మందు తాగి చనిపోయింది. ఆ సంఘటన ఆధారంగా చేసుకుని ఆయన కథలు రాయటం ప్రారంభించారు.

మూలాలు

[మార్చు]