యసుటారో కొయిడే
యసుటారో కొయిడే 112 సంవత్సరాలు జీవించిన జపాన్ కురువృద్ధుడు. రైట్ సోదరులు విమానాన్ని తయారుచేయడానికి కొన్ని నెలల ముందు ఆయన జన్మించారని, అత్యధిక వయసుగల వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా చోటు దక్కించుకున్నారని తెలిపారు.
జీవిత విశేషాలు
[మార్చు]ఆయన 1903, మార్చి 13న జన్మించారు. దర్జీగా ఒక బట్టల దుకాణంలో పనిచేసారు.[1] తన 107వ యేట నగోయా ప్రాంతానికి తన కుమార్తె వద్ద నివసించడానికి వెళ్లారు.[2] ఆయనకు 110 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఆయన వార్తాపత్రికలను కళ్ళద్దాలు లేకుండా చదువగలిగేవారు. కట్టుడు పళ్ళు లేకుండా స్వంత దంతాలతో ఆహారం నమిలి తినేవారు.[3] ఐచి ప్రెఫెక్టర్ లో ఆయన ఎక్కువకాలం జీవించిన వ్యక్తిగా "నగోయా" సహచరుడు అయిన "త్సూయ మియురా" తన 111 వ యేట మరణించిన తరువాత మార్చి 31, 2014 న చరిత్రలో నిలిచారు.[4]
ఆగష్టు 21, 2015 న అద్యధిక కాలం జీవించిన వ్యక్తిగా అధికారికంగా గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించాడు.[1] కొయిడె దీర్ఘాయుష్షుకు రహస్యమేమిటీ అని గతంలో ఆయనను పలువురు అడిగేవారట. అందుకు ఆయన చిరునవ్వుతో చెప్పిన జవాబేమిటంటే... ‘శక్తికి మించి పనిచేయవద్దు... ఆనందంగా జీవించాలి’ అని. ప్రపంచ దేశాల్లో జపాను వాసులే దీర్ఘాయుష్కులుగా ఉంటున్నారు. ప్రస్తుతం అక్కడి జనాభాలో నాలుగో వంతు 65 ఏళ్లు పైబడిన వారే.[2]
ఆయన జనవరి 19 2016 న గుండె పనితీరులో లోపం వల్ల నగోరా లోని ఆసుపత్రిలో మరణించారు.[5]
మూలాలు
[మార్చు]- 1 2 "Guinness names new holder of world's oldest man title". CBS News. CBS Interactive Inc. 2015-08-21. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2015-08-22.
- 1 2 Swatman, Rachel (2015-08-20). "Guinness World Records introduces Yasutaro Koide - the new oldest living man". Guinness World Records. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2015-08-22.
- ↑ 県内男性最高齢の小出さん110歳に [Oldest man in prefecture turns 110]. Chunichi Web (in జపనీస్). Japan: The Chunichi Shimbun. 2013-03-14. the original నుండి 2013-03-17 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2015-07-08.
- ↑ 市内 (県内) 最高齢者の死亡について [Death of oldest resident in city (prefecture)] (PDF). Press release (in జపనీస్). Japan: City of Nagoya. 2014-04-01. the original (pdf) నుండి 2016-03-05 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2016-01-19.
- ↑ "World's oldest man dies at 112 in Japan". Gulf Digital News. 2016-01-19. the original నుండి 2016-01-19 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2016-01-19.