యానాం పురపాలక సంఘం
స్వరూపం
యానాం | |
స్థాపన | 1974 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
ప్రధాన కార్యాలయాలు | యానాం |
కార్యస్థానం | |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
జాలగూడు | అధికార వెబ్ సైట్ |
యానాం పురపాలక సంఘం 1974లో పాండిచ్చేరి మున్సిపాలిటీ చట్టం ప్రకారం పురపాలక సంఘం ఏర్పాటు చేశారు.
జనాభా గణాంకాలు
[మార్చు]యానాం పురపాలక సంఘం లో 10 వార్డులుగా విభజించారు, దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి.2011 జనాభా లెక్కల ప్రకారం యానాం మునిసిపాలిటీలో 55,626 జనాభా ఉండగా అందులో పురుషులు 27,301 మహిళలు 28,325 మంది ఉన్నారు. ఈ పురపాలక సంఘ పరిధిలో మొత్తం 13,812 ఇండ్లు కలిగిఉన్నాయి. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 6204 ఉన్నారు.అక్షరాస్యత రేటు 79.47% పురుష జనాభాలో 82% ఉండగా, స్త్రీ జనాభాలో 76% అక్షరాస్యులు ఉన్నారు.[1]
వార్డులు
[మార్చు]పురపాలక సంఘంలో మొత్తం పది వార్డులు ఉన్నాయి.
- యానాం పట్టణం
- కనకాల పేట
- మెట్టకుర్
- ఫారం పేట
- గిరియమం పేట
- అంబేద్కర్ నగర్
- విష్ణాలయం
- పిలారయ
- పైడికొండల
- పెద్దపూడి
- అగ్రహారం
పర్యాటక రంగం
[మార్చు]- వేంకటేశ్వర స్వామి దేవాలయం:వైష్ణవాలయం వీధి (ర్యూ విషెను) లో ప్రసిద్ధి చెందిన అలివేలు మంగా సహిత వేంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది.ఇక్కడి ప్రజలు చైడికుడి వెంకన్న, మీసాల వెంకన్న అని పిలుస్తారు.[2]
- మసీదు:1848 సంవత్సరంలో ఈ మసీదు నిర్మించారు.1978 సంవత్సరంలో మసీదుని పూర్తిగా తొలగించి 1999-2000 లో నూతన మసీదు నిర్మించారు. ఒకే సమయంలో 200 మంది భక్తులు ఈ మసీదులో ప్రార్థన జరుపుకొనే అవకాశం ఉంది.[3]
- కాథలిక్ చర్చి: దీనిని సెయింట్ ఆన్స్ కాథలిక్ చర్చి అని పిలుస్తారు. ఈ చర్చి ఐరోపా ఖండపు నిర్మాణశైలిలో నిర్మితమైనది.1846 సంవత్సరంలో ఫ్రెంచి మతసంస్థల ద్వారా ఈ చర్చి నిర్మాణం జరిగింది.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Yanam Municipality City Population Census 2011-2020 | Puducherry". www.census2011.co.in. Retrieved 2020-12-15.
- ↑ 2.0 2.1 "పర్యాటక స్థలాలు | యానాం, పుదుచ్చేరి ప్రభుత్వం | ఇండియ". Retrieved 2020-12-16.
- ↑ "నేడే లూర్ధుమాత ఉత్సవం". www.andhrajyothy.com. Retrieved 2020-12-16.