యావుజ్ సుల్తాన్ సెలిం వంతెన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యవుజ్ సుల్తాన్ సెలిం బ్రిడ్జి
Poyrazköy'den 3. köprü.jpg
జూలై 2015 లో నిర్మాణం సమయంలో వంతెన
అధికార నామంయవుజ్ సుల్తాన్ సెలిం బ్రిడ్జి
ఇతర పేర్లుమూడవ బొస్పొరస్ బ్రిడ్జి
మోసే వాహనాలునాలుగు మోటార్ వాహన దారులు మరియు ప్రతి దిశలో ఒక రైల్వే లైన్
దేనిపై నిర్మింపబడినదిబొస్పొరస్
ప్రదేశంఇస్తాంబుల్
నిర్వహించువారుİçtaş
Astaldi
రూపకర్తజీన్-ఫ్రాంకోయిస్ క్లైన్
మిచెల్ విర్లొగెవ్
వంతెన రకంహైబ్రిడ్ తీగల ఆధారిత, వేలాడే వంతెన
మొత్తం పొడవు2,164 m (7,100 ft)[1]
వెడల్పు58.5 m (192 ft)[1]
ఎత్తు322+ m (1,056+ ft)[1]
పొడవైన స్పేన్1,408 m (4,619 ft)[1]
నిర్మాణ ప్రారంభం2013
నిర్మాణ వ్యయంTurkish lira symbol 8x10px.png4.5 బిలియన్
ప్రారంభం26 ఆగస్టు 2016
టోల్$3.00
భౌగోళికాంశాలు41°12′10″N 29°06′42″E / 41.20291°N 29.11162°E / 41.20291; 29.11162Coordinates: 41°12′10″N 29°06′42″E / 41.20291°N 29.11162°E / 41.20291; 29.11162

యవుజ్ సుల్తాన్ సెలిం బ్రిడ్జి (Yavuz Sultan Selim Bridge) అనేది ఇస్తాంబుల్, టర్కీ లో ఇప్పటికే ఉన్న రెండు వంతెనల యొక్క బొస్పొరస్, నార్త్ మీదుగా రైలు మరియు మోటారు వాహనాల రవాణా కొరకు ఉన్న ఒక వంతెన. దీనికి మొదట్లో మూడవ బొస్పొరస్ బ్రిడ్జి అని పేరు పెట్టబడినది (మొదటి బొస్పొరస్ బ్రిడ్జి పేరు బొస్పొరస్ బ్రిడ్జి మరియు రెండవ బొస్పొరస్ బ్రిడ్జి పేరు ఫతిహ్ సుల్తాన్ మెహ్మెత్ బ్రిడ్జి). ఇది సుమారు 5 కిలోమీటర్ల (3.1 మైళ్లు) దూరమున బొస్పొరస్ బ్రిడ్జి కి ఉత్తరాన ఉంటుంది.


Yavuz Sultan Selim Bridge IMG 3054.jpg

ఈ వంతెన బాస్పోరస్‌ అనే జలసంధిపై నిర్మించారు. ఈ వంతెన పేరు యావుజ్‌ సుల్తాన్‌ సెలిం బ్రిడ్జ్‌. ఒట్టోమాన్‌ను పాలించిన రాజు యావుజ్‌ సుల్తాన్‌ సెలిం జ్ఞాపకార్థం ఈ వంతెనకు ఈ పేరు పెట్టారు. ఈ వంతెన నిర్మించడం వల్ల ఇస్తాంబుల్‌లో ట్రాఫిక్‌ కష్టాలు చాలా తగ్గాయి.ఈ వంతెన యూరప్‌, ఆసియాలను కలుపుతుంది.

వంతెన నిర్మాణం[మార్చు]

వంతెనకు డిజైన్‌ రూపొందించింది ఫ్రాన్స్‌కు చెందిన మైఖెల్‌ విర్లోజెక్స్‌ అనే ఇంజనీర్‌. ఒక వైపు మోటారు వాహనాల కోసం నాలుగు లైన్లు ఉంటాయి. ఒక రైల్వే లైను ఉంటుంది. రెండు లైన్లు కలుపుకుంటే ఎనిమిది వరుసల రహదారి, మధ్యలో రెండు రైల్వే లైన్లు ఉంటాయి. సస్పెన్షన్‌ బ్రిడ్జ్‌పై రైల్వే లైన్లు ఏర్పాటు చేసిన మొట్ట మొదటి వంతెన ఇదే. రెండు స్తంభాల మధ్య దూరం 4600 అడుగులు ఉంటుంది. రెండు స్తంభాలను కలుపుతూ తీగలుంటాయు. ఆ తీగలపై వంతెన వేలాడుతూ ఉంటుంది. ఈ వంతెన పొడవు 2.1 కి.మీ. ఈ వంతెన నిర్మాణానికి వేలమంది కార్మికులు రెండు సంవత్సరాలు శ్రమించి ఈ వంతెన నిర్మించారు.

మూలాలు[మార్చు]

  • 1.0 1.1 1.2 1.3 ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; kgmKatalog అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు