Jump to content

యాసిన్ భత్కల్

వికీపీడియా నుండి
(యాసీన్ భట్కల్ నుండి దారిమార్పు చెందింది)
యాసిన్ భత్కల్ / సయ్యద్ అహ్మద్ సిద్దిబప్పా
జననం
ముహమ్మద్ అహ్మద్ సిద్దిబప్పా

(1983-01-15) 1983 జనవరి 15 (వయసు 41)
వృత్తిఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు
పదవీ కాలం2007 - 2013
ఇండియన్ ముజాహిదీన్
యాసిన్ భత్కల్

యాసిన్ భట్కల్ అలియాస్ ముహమ్మద్ అహ్మద్ సిద్దిబప్పా ఒక అంతర్జాతీయ ఉగ్రవాది. ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు. భారతదేశంలోని పలు ప్రాంతాలలో ఉగ్రవాద దాడులకు పాల్పడి అనేకమంది అమాయక ప్రజల ఉసురు తీశాడు.

నేపధ్యము

[మార్చు]

సయ్యద్ అహ్మద్ సిద్దిబప్పా అలియాస్ యాసిన్ భత్కల్ కర్ణాటకలోని భట్కల్ పట్టణానికి చెందినవాడు. సూరత్, అహ్మదాబాద్, బెంగళూరు, పుణే, ఢిల్లీ, హైదరాబాద్‌లోని దిల్‌షుక్‌నగర్‌లలో జరిగిన బాంబు పేలుళ్ళకు ప్రధాన సూత్రధారిగా భారత నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఈ కేసులకు సంబంధించి పోలీసులు, నిఘా బృందాలు 2008 నుండి భత్కల్ కోసం వెతుకుతున్నాయి. తన సోదరుడు రియాజ్ భత్కల్, అబ్దుల్ సుభాన్ ఖురేషీలతో కలిసి 2008లో ఇండియన్ ముజాహిదీన్ సంస్థను ప్రారంభించాడు. దేశవ్యాప్తంగా ఎందరో యువకులను యువకులను ఉగ్రవాదం వైపు ఆకర్షించి, అనేక నిద్రాణ కేంద్రాల్లో (స్లీపింగ్ సెల్స్) సభ్యులుగా సంఘటితం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

2008 ఢిల్లీలో జరిగిన వరుస బాంబు పేలుళ్ళ ఘటన తర్వాత నుంచి యాసిన్ భత్కల్‌పేరు ప్రముఖంగా వినపడుతోంది. పిల్లలు, మహిళలతో సహా 18 మంది మృతి చెంది, వందలాది మంది క్షతగాత్రులైన దిల్‌షుక్‌నగర్ పేలుళ్ళ ఘటనలో భత్కల్ కీలక సూత్రధారిగా పోలీసులు భావిస్తున్నారు. 2007లో లుంబినీ పార్క్, గోకుల్ ఛాట్‌ల వద్ద జరిగిన జంట పేలుళ్ళ కేసు దర్యాప్తు ఇంకా సాగుతున్నది.

పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ 'లష్కరే తొయిబ'కు అనుబంధ విభాగమైన ఐఎమ్ సంస్థ దేశంలో పలు నగరాల్లో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడి వందల మంది ప్రజల ప్రాణాలను బలి తీసుకుంది. కాశ్మీర్ విముక్తి పేరుతో లష్కరే తొయిబ ఉగ్రవాద సంస్థ ఉనికిలోకి వచ్చింది. తొలితరం ఉగ్రవాదులుగా పరిగణిస్తున్న దావూద్ ఇబ్రహీం, మసూద్ అజర్‌లు రామజన్మ భూమి వివాదం నేపథ్యంలో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాల సహకారంతో 1993 ముంబయి వరుస పేలుళ్ళకు పాల్పడ్డారని భారత పోలీసు వర్గాలు తెలిపారు.. అయితే 2002 గుజరాత్‌లో ముస్లింల మారణహోమం నేపథ్యంలో దేశీయ ఉగ్రవాదం (ఐఎమ్) తలెత్తిందని కొందరి అభిప్రాయం. దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుళ్ళ కేసులో అరెస్టయిన ఐఎమ్ ఉగ్రవాది మక్బూల్ విచారణలో ఆ సంస్థకు సంబంధించిన కార్యకలాపాల తీరుతెన్నులు బయటపడినట్లు సమాచారం. దేశంలో 2013 దాకా ఐఎమ్ ఉగ్రవాదులు కేవలం 30 మంది మాత్రమే పట్టుబడ్డారు.

ఫిబ్రవరి 21 దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల సూత్రధారులు ఇండియన్‌ ముజాహిదిన్‌ ఉగ్రవాదాలు యాసిన్‌ భత్కల్‌, అసదుల్లా అక్తర్‌లను ఆరునెల్ల తర్వాత పట్టుబడ్డారు. ఇండో-నేపాల్‌ సరిహద్దులో బీహార్‌ పోలీసులు ఆగస్టు 28, 2013 న వారిని అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం డిల్లీ తరలించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) పలుకోణాల్లో వీరిద్దరిని విచారించింది. భక్తల్‌, అక్తర్‌లు ఇచ్చిన సమాచారంతో బీహార్‌లో పలుచోట్ల ఎన్‌ఐఎ బృందం సోదాలు నిర్వహించింది. దిల్‌సుఖ్‌నగర్‌ జంట బాంబు పేలుళ్లకు తానే వ్యూహం పన్నినట్లు యాసిన్ భత్కల్ అంగీకరించాడు. హైదరాబాద్ నగరంలో బాంబు పేలుళ్లకు వ్యూహ రచన చేసి విధ్వంసానికి కారణమైనట్లు తెలిపాడు. దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్లతో పాటు దేశవ్యాప్తంగా సుమారు 40 బాంబు పేలుళ్ల కేసులలో భత్కల్ నిందితుడు.

ఇవీ చూడండి

[మార్చు]