యుగాంతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2012 డిసెంబరు 21, డూమ్స్ డే లేదా యుగాంతం గా పిలువ బడుతోంది. ఈ రోజున మొత్తం తొమ్మిది గ్రహాలు ఒకే సరళ రేఖపైకి వస్తాయి. అందువలని వివిధ గ్రహాల ఆకర్షణ, వికర్షణ ల ఫలితంగా భూగోళం అల్లకల్లొలం అవుతుందని పరిశోధకుల కథనం. ఈ పరిణామంతో భూమి మీద ఏ ప్రాణీ బ్రతికి ఉండే అవకాశం ఉండదని ఒక కథనం. అంతే కాకుండా అదే రోజున "పోలార్ షిప్మెంట్" అనగా ధ్రువాల మార్పిడి కూడా జరుగుతుంది అని నాసా శాస్త్రజ్ఞులు ధ్రువీకరించారు. దీని పరిణామంతో ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం గాను, దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువం గాను మారుతాయి. ఫలితంగా అరా కొరాగా మిగిలిన ఏ ప్రాణీ కూడా మనుగడ సాగించే అవకాశం కూడా ఉండదు. మనిషి నిటారుగా (రెండు కాళ్ళ మీద) నిలబడ లేడు. మరలా నాలుగు కాళ్ళ మీద నిలబడవలసిన పరిస్థితి. అంతేగాక మనుషుల వెన్నెముక కూడా నిలువుగా ఉండలేదు. అది కూడా వాలిపోతుంది.

శాస్త్రజ్ఞుల అంచనా[మార్చు]

అసలు శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం భూగోళంలో చాలా భాగం సముద్రంలో కలసిపోయి, సముద్ర భాగం నుండి కొత్త భూభాగం పుట్టుకొస్తుంది. ఇది సృష్టి ధర్మం. ఇపుడు భూ భాగం లోని అన్ని ప్రకృతి వనరులు అంతరించి పోయాయి. మరలా ఇవి సముద్రంలో రీ సైక్లింగ్ అయి కొన్ని వేల సంవత్సరాల తరువాత మరలా ఇదే రకమైన ప్రకృతి వినాశనంతో బయటికి వస్తాయి. ఇది నిరంతరాయంగా జరిగే ప్రక్రియ.

ఈ పై పరిణామాలు అన్నీ జరుగుతాయి అనె నిక్కచ్చిగా ఎవరూ చెప్పటంలేదు. కాని చాలా మంది శాస్త్రజ్ఞులు వారి వారి సిద్ధాంతాల ప్రకారం జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెపుతున్నారు.

మరి కొన్ని విశ్లేషణలు..

1. దక్షిణ అమెరికాలో నివసించే 'మాయా' తెగల పంచాంగం ప్రకారం 2012 డిసెంబరు 21 ప్రపంచానికి ఆఖరి రోజు.

2. ఖగోళ శాస్త్రజ్ఞుల అంచనాల ప్రకారం, 2012 లో సౌర తుఫానులు తీవ్ర రూపం దాల్చుతాయి. అవి ఇప్పటికే భూమి, మరికొన్ని గ్రహాలపై తమ ప్రభావాన్ని చూపుతున్నాయి.

3. శాస్త్రజ్ఞులు 2012లో అణు రియాక్టర్ ( LHC) లో ఒక గొప్ప అణువిస్ఫోటనం గావించి, విశ్వం యొక్క పుట్టు పూర్వోత్తరాలను కనుగొనబోతున్నారు. ఈ అణు రియాక్టర్‌ను ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాల భూగర్భంలో 27 కిలోమీటర్ల పొడవున్న సొరంగంలో నెలకొల్పారు. అక్కడ ఇప్పటికే కొన్ని పరీక్షలను జరుపుతున్నారు. ఐతే కొందరు 2012లో జరుపబడే ఈ అణుపరీక్ష వికటించి, సమస్త జంతుజాలం నశించిపోతుందని చెబుతున్నారు.

4. బైబిల్ ప్రకారం 2012లో మంచీ - చెడుల మధ్య ఆఖరిపోరాటం జరగబోతోంది. హిందూ శాస్త్రాలలో కలికి అవతారం గురించి, " మ్లేచ్చ నివహ నిధనే కలయసి కరవాలం; ధూమకేతుమివ కిమపి కరాళం" అని ఉండనే ఉంది. మరికొందరి అభిప్రాయం ప్రకారం, మానవాళి పూర్తిగా నశించదు. కాని వారిలో ఒక గొప్ప నూతన ఆధ్యాత్మిక మార్పు వస్తుంది. శ్రీ అరబింద్ ఘోష్ కూడా " మనిషి ఏదో ఒకరోజు supramental స్థితిని అందుకోగలుగుతాడు " అని చెప్పారు.

5. అమెరికాలోని యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ ఎప్పుడూ వేడినీటి బుగ్గలను విరజిమ్ముతూ ఉంటుంది. దీనికి కారణం అది సరిగ్గా ఒక అగ్నిపర్వతం మీద నెలకొని ఉంది. ఐతే ఈ అగ్నిపర్వతానికి ప్రతి 650,000 సంవత్సరాలకొకసారి ఆవులించే ఒక చెడ్డ అలవాటు ఉంది. దాని మూలంగా ఆకాశమంతా బూడిదతో కప్పబడి, సూర్యరశ్మి భూమిపై సోకదు. అప్పుడు భూమి పూర్తిగా చల్లబడి, మంచుఖండంలా మారుతుంది. అది అలా 15,000 సంవత్స్సరాల వరకు కొనసాగుతుంది. యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ అడుగన రోజురోజుకీ పీడనం పెరుగుతోంది. అది 2012లో పూర్తిస్థాయిలో ఉంటుందని భూగర్భ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

6. ఉత్తర దక్షిణ ధ్రువాలు ప్రతి 750,000 సంవత్సరాల కొకసారి తమ స్థానాలు మార్చుకుంటాయట ! ఇప్పటికే ధ్రువాలు ఏడాదికి 20 - 30 కిలోమీటర్‌లు ఎడంగా జరుగుతున్నాయట ! అలా క్రమేపీ భూమి చుట్టు ఉన్న అయస్కాంత శక్తి నశించిపోయి, అల్ట్రా వయొలెట్ కిరణాలు భూమిపై సోకి, సర్వ ప్రాణులను నశింప జేస్తాయని ఒక కథనం.

7. 2012లో ఒక పెద్ద ఉల్క భూమిని ఢీకొనబోతోది. అలా కాని జరిగితే, అప్పుడు భయంకరమైన భూకంపాలు, సునామీలు సంభవించవచ్చు.

కాల జ్ఞానుల అంచనా[మార్చు]

  • ప్రముఖ భవిష్యత్ దార్శనికుడు నోష్ట్రడామస్, మాయన్స్ కాలెండరు మొదలైనవి కూడా ఈ విషయాలను ధ్రువీకరిస్తున్నాయి.
  • శ్రీ పోతులూరి వీరిబ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో యుగాంతం గురించి చెప్పారు.

మతగ్రంధాలు ఏం చెబుతున్నాయి?[మార్చు]

  • పరిశుద్ధ గ్రంథం (బైబిల్) క్రొత్త నిబంధన - ప్రకటన గ్రంథంలో యుగాంతం 7 దశలుగా జరుగబోతున్నట్లు చెప్పబడింది.

కారణాలు[మార్చు]

అంతే కాకుండా, భూగోళాన్ని వినాశనం దిశగా తీసుకెళ్ళ్డ డానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మానవ తప్పిదాలు. ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాల వద్ద గల అణ్వాయుధాలు కలిపి ఈ భూగొళాన్ని కనీసం 500 సార్లు భస్మీపటలం చేయగలవు. మొత్తం భూమిని భస్మీపటలం చేసి, మొత్తం సముద్రాలని ఆవిరి చేయగల శక్తి వాటి సొంతం.

వీటన్నిటికి టార్గెట్ 21-12-2012. అందుకే ఈ రోజుని డూమ్స్ డే అని పిలుస్తున్నరు.

మరిన్ని వివరాల కోసం గూగుల్ లో సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు.

అంతా పచ్చి అబద్ధం.ప్రళయం రాదు...అబ్దుల్ కలాం (శాస్త్రవేత్త,మాజీ రాస్ట్రపతి)[మార్చు]

2012 లో ప్రళయం ప్రళయం వస్తుందనే మాటలో ఏ మాత్రం నిజంలేదని శాస్త్రవేత్త, మాజీ రాస్ట్రపతి అబ్దుల్ కలాం స్పస్టంగా చెప్పారు.2012లో విశ్వంలో కొన్ని మార్పులు జరగవచ్చు కాని ప్రళయం వచ్చేంతకావని ఆయన అన్నారు.ఇది కేవలం కొందరు వ్యక్తులు చేస్తున్నభూటక ప్రచారం మాత్రమేనని వ్యాఖ్యానించారు. (సాక్షి దినపత్రిక 27-11-2009)...

"https://te.wikipedia.org/w/index.php?title=యుగాంతం&oldid=3466454" నుండి వెలికితీశారు