యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Union Public Service Commission
Emblem of India.svg
సంకేతాక్షరం UPSC
స్థాపన అక్టోబరు 1, 1926 (1926-10-01) (90 years ago)
రకం GO
కార్యస్థానం
సేవా ప్రాంతాలు India
జాలగూడు UPSC Website

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Union Public Service Commission or UPSC ), పలు భారతీయ సివిల్ సర్వీసులలో నియామకాల కోసం పరీక్షలు నిర్వహించడానికి అధికారం ఇవ్వబడిన భారత్‌లోని ఒక రాజ్యాంగ విభాగం. భారత రాజ్యాంగం (XIV భాగం – యూనియన్ మరియు రాష్ట్రాలలోని సర్వీసులు - ఆర్టికల్ సంఖ్య 315 నుంచి 323 వరకు) కేంద్రానికి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను, ప్రతి రాష్ట్రానికి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను అందిస్తుంది.

చరిత్ర[మార్చు]

అత్యున్నత సివిల్ సర్వీసులు భారతీకరించాలంటూ భారత రాజకీయ నేతలు చేసిన డిమాండ్లకు అనుగుణంగా, మొట్టమొదటి పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను అప్పటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం 1926 అక్టోబర్ 1న ఏర్పర్చింది. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పని చాలావరకు సలహాపూర్వకం గానే ఉండేది, ఈ పరిమితి వల్ల, స్వాతంత్ర్య పోరాటంతో ముడిపడిన భారత రాజకీయ పార్టీల డిమాండ్లను ఇది సంతృప్తి పర్చలేకపోయింది. బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత ఒక సమాఖ్య పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పర్చిచింది మరియు భారత ప్రభుత్వ చట్టం 1935 కింద ప్రాదేశిక స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఏర్పాటుకు వీలు కల్పించింది.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక రాష్ట్ర గవర్నర్ అభ్యర్థించినట్లయితే, రాష్ట్రపతి ఆమోదంతో మణిపూర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వలే ఏదైనా రాష్ట్రం కోసం పనిచేస్తుంది.

UPSC సభ్యులు[మార్చు]

దస్త్రం:DholpurHouse.jpg
దోల్పూర్ హౌస్, న్యూఢిల్లీ

UPSC (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్)ఛైర్మన్ మరియు ఇతర సభ్యులు, భారత రాష్ట్రపతిచే నియమించబడతారు. కమిషన్‌లో కనీసం సగంమంది సభ్యులు కేంద్ర లేదా రాష్ట్ర సర్వీసులో కనీసం పదేళ్ల అనుభవం కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు (పనిచేస్తున్నవారు లేదా పదవీవిరమణ చేసినవారు).


ప్రతి సభ్యుడూ ఆరేళ్ల కాలం లేదా అతడికి అరవై అయిదేళ్ల వయస్సు వచ్చేంతవరకు, ఏది ముందయితే అది.. ఆఫీసులో పనిచేయవచ్చు.

అతడు తన రాజీనామాను ఏ సమయంలో అయినా భారత రాష్ట్రపతికి సమర్పించవచ్చు. దుష్ప్రవర్తన కారణంగా (అలాంటి దుష్ప్రవర్తనపై విచారణ జరిగి దాన్ని సుప్రీంకోర్టు సమర్థించినట్లయితేనే) లేక దివాలాకోరుగా రుజువయినట్లయితే, లేదా తన పదవీకాలంలో ఆఫీసుకు వెలుపల వేతనం చెల్లించబడిన పనిలో ఉన్నట్లయితే లేక శరీరం లేదా మనస్సు అస్థిరంగా ఉందన్న కారణంతో అతడు ఆఫీసులో కొనసాగలేడని రాష్ట్రపతి అభిప్రాయపడినట్లయితే అతడిని ఉద్యోగం నుంచి రాష్ట్రపతి తొలగించవచ్చు.

2010 మే నాటికి, కమిషన్ ప్రొఫెసర్ డి.పి అగర్వాల్ నేతృత్వంలో నడిచేది ఇతడు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & మేనేజ్‌మెంట్, గ్వాలియర్‌లో డైరెక్టర్ పదవి నిర్వహించేవాడు. ఛైర్మన్ పదవికి అదనంగా మరొక పదిమంది సభ్యులు ఉంటారు.

UPSCలో ప్రస్తుత సభ్యులు[మార్చు]

నవంబర్ 2010 నాటికి, కమిషన్‌లో ఒక ఛైర్మన్‌తోపాటు 9 మంది సభ్యులు ఉండేవారు. సభ్యుల పేర్లు:

  1. శ్రీ I M G ఖాన్
  2. డాక్టర్. K K పాల్
  3. ప్రొఫెసర్. K. S. చలం
  4. Lt. జనరల్. (రిటైర్డ్.) నిర్భయ్ శర్మ
  5. శ్రీ ప్రశాంత కుమార్ మిశ్రా
  6. ప్రొఫెసర్. పురుషోత్తమ్ అగర్వాల్
  7. శ్రీమతి రజ్ని రాజ్‌ధన్
  8. శ్రీమతి శశి ఉబన్ త్రిపాఠి
  9. శ్రీ విజయ్ సింగ్
  10. అల్క సిరొహి

విధులు[మార్చు]

కేంద్ర సర్వీసులలో నియామకాల కోసం పరీక్షలు నిర్వహించడం UPSC విధి

1 పోటీ పరీక్షలు నిర్వహించడం ద్వారా కేంద్రంలో సర్వీసులకోసం నియామకం & పోస్టులు . ఇది నిరంతరం నియామకాలు జరిపే వ్యవస్థ, ఇక్కడ పరీక్షలు నిర్వహించబడి తదనంతరం ఇంటర్వ్యూలు జరుగుతుంటాయి. పోటీ పరీక్షల వార్షిక జాబితా:

2. కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యక్ష ఎంపిక ద్వారా సర్వీసులు & పోస్టులలో నియామకం జరుగుతాయి ఈ రకం నియామకాల్లో తక్షణ/అపక్రమ ఉద్యోగాల ఖాళీలను వెంటనే పూరించడం జరుగుతుంది. ఇది సాధారణంగా ప్రత్యక్ష ఇంటర్వ్యూల ద్వారా జరుగుతుంది కాని కొన్ని సమయాల్లో ఇంటర్వ్యూకు ముందు రాతపూర్వక పరీక్ష ఉంటుంది.

3. పదోన్నతి దీనితోపాటు ఉపనియామకంపై బదిలీల సందర్భంగా తగిన అధికారుల కోసం కమిషన్ సలహా ఇస్తుంది

4. వివిధ సర్వీసులు మరియు పదవులకు నియామక పద్ధతులకు సంబంధించిన అన్ని విషయాలపై కమిషన్ ప్రభుత్వానికి సలహా ఇస్తుంది

5. క్రమశిక్షణా కేసులు వివిధ సివిల్ సర్వీసులకు సంబంధించినవి మరియు

6. ఇతర అంశాలు అదనపు సాధారణ ఫించన్ల మంజూరీ, లీగల్ ఖర్చులను తిరిగి చెల్లించడం వగైరాలకు సంబంధించినవి...

నియామక నిబంధనలు[మార్చు]

రాజ్యాంగంలోని ఆర్టికల్ 320లో పొందుపర్చిన నిబంధనలకు అనుగుణంగా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (చర్చలనుంచి మినహాయింపు) నియమాలు 1958, భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వశాఖలు/విభాగాలలో గ్రూప్ ‘A’ మరియు గ్రూప్ ‘B" లోని అన్ని పోస్టుల నియామక చట్టాలు కమిషన్‌తో చర్చలు జరపడానికి అవసరమవుతాయి. ఆర్టికల్ 321 నిబంధనలకు అనుగుణంగా పార్లమెంట్ చేసిన తగిన చట్టాల పరిధిలో, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్, న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వంటి సంస్థలలో కొన్ని విభాగాల పదవులకు నియామక సూత్రాలను రూపొందించడం/సవరించడానికి కూడా కమిషన్‌తో చర్చించడం అవసరమవుతుంది.

రుసుము చెల్లింపు పద్ధతి[మార్చు]

నియామకం ప్రక్రియ కోసం రుసుములను CRF (సెంట్రల్ రిక్రూట్‌మెంట్ ఫీ స్టాంప్) పత్రం రూపంలో ఉంటాయి. సర్వీస్ పరీక్షలకోసం, రుసుము రూ.100లు మరియు ప్రత్యక్ష నిమామకానికి రుసుము రూ.50లు.

నివేదికలు[మార్చు]

UPSC ప్రతి ఏటా తన పనిపై నివేదికను భారత రాష్ట్రపతికి సమర్పిస్తుంది. తర్వాత దాన్ని చర్చించడానికి పార్లమెంట్ ఉభయసభలకు పంపిస్తారు.

సూచనలు[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]