యూరేసియా స్పారోహాక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Accipiter nisus

యూరేసియా స్పారోహాక్ వేటాడే మాంసాహార పక్షి. దీని శాస్త్రీయనామం యాక్సిప్టర్ మైసస్ (Accipiter misus). దీన్ని స్పారోహాక్, నార్తరన్ స్పారోహాక్ అనికూడా వ్యవహరిస్తారు. ఈ పక్షులు భారత దేశమంతా కనిపిస్తాయి. పయి భాగం నీలంవర్ణం కలిసిన బూడిద రంగులో ఉంటుంది. క్రింది భాగం తెలుపు బూడిద రంగు కలిసి నిలువు గుర్తులు కలిగి, పొట్టిగా, విశాలమయిన రెక్కలు కలిగి ఉంటుంది. ఆడవి, పిల్లలు చాయవెలిసిన తేలిక బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఎదిగిన పక్షులు షుమారు 220 గ్రాముల బరువుంటాయి. ఆడపక్షి బరువు మగదాని కంటే 25% దాకా ఎక్కువ ఉంటుంది. పక్షి జాతుల్లో అడ మగల మధ్య బరువులో ఉండే అత్యంత పెద్ద తేడాల్లో ఇది ఒకటి.[1]

ఆహారపు అలవాట్లు:చిన్న పిట్టలు, పిచ్చుకలు, తొండలు, బల్లులు, ఎలుకలు వంటి జంతువులను వేటాడి తింటుంది. అరుదుగా రెండు రెక్కలు చాపి గగనంలో విహరిస్తుంది, వేటాడే పద్ధతిలో ఇది ఎరమీదకు దుముకుతుంది. పొడవాటి దృఢమైన కాళ్ళు చిన్న పిట్టలను వేటాడదనికి అనువుగా వుంటాయి. దీని జీవితకాలం నాలుగు ఏళ్ళనుంచి నలభై ఏళ్లవరకు ఉంటుంది. చెట్లు దట్టంగా ఉన్నచోట నగరాల్లో , నగర శివార్లలో గూళ్ళు కడతాయి.

మూలాలు

[మార్చు]
  1. Robinson, R.A. "Sparrowhawk Accipiter nisus [Linnaeus, 1758]". BirdFacts: profiles of birds occurring in Britain & Ireland. British Trust for Ornithology. Archived from the original on 11 ఆగస్టు 2011. Retrieved 26 ఫిబ్రవరి 2009.