Jump to content

యెనిశెట్టి సాంబశివరావు

వికీపీడియా నుండి
యెనిశెట్టి సాంబశివరావు

ప్రొఫెసర్ యెనిశెట్టి సాంబశివరావు గాంధీజీ తత్వవేత్త. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామంలో జన్మించారు.తండ్రి సుందరయ్య వ్యాపారం చేసేవారు.ఆయన కళ్లు తెరిచేనాటికి అమ్మ కన్ను మూసింది.మేనత్త, నాయనమ్మల దగ్గర పెరిగారు.చీరాల, హిందూపురం, మార్కాపురం డిగ్రీ కళాశాలల్లో ఆంధ్ర అధ్యాపకునిగా, ప్రొఫెసర్‌గా పనిచేసి 1999లో హెచ్‌ఓడిగా ఉద్యోగ విరమణ చేశారు.గాంధీతత్వంపై పిహెచ్‌డి చేశారు.ఉద్యోగ విరమణ తర్వాత సేవాకార్యక్రమాల్లో పాల్గొనడం మొదలెట్టారు. ‘విద్యార్థి మార్గదర్శిని’, ‘అభ్యుదయ వాదులారా ఏకం కండి’ పేరుతో పుస్తకాలను రాసి మహాత్మునికి అంకితం ఇచ్చారు.సైకిల్‌పై తిరుగుతూ సభలు, సమావేశాలున్నచోట గాంధీజీ సిద్ధాంతాలకు సంబంధించిన ఉపన్యాసాలు ఇచ్చేవారు.గుంటూరు జిల్లాలోని కొండవీడు కోటల పక్కనున్న 60 ఎకరాల ప్రభుత్వ భూమిలో మహాత్మాగాంధీ తత్వ విశ్వవిద్యాలయం స్థాపిస్తే గనక తనకున్న యావదాస్తి దానికోసం రాసిస్తానని, గాంధీ మహాత్మునికి సంబంధించిన ఎంతో విలువైన గ్రంథాల కలెక్షన్ కూడా ఇస్తానని వీలునామారాశారు.లేదంటే చైనా ప్రభుత్వం కట్టబోతున్న విశ్వవిద్యాలయానికి తన ఆస్తిని ఇచ్చేసి ఆ మహాత్ముని రుణం తీర్చుకుంటానన్నారు. గాంధీజీ తత్వవిశ్వవిద్యాలయం స్థాపనకు కృషి చేస్తున్నారు. గానీ యింతవరకు ఆయన ఆశయం సిద్దించలేదు.

భావాలు అనుభవాలు

[మార్చు]
  • ప్రస్తుతం ప్రతిచోటా హింస రాజ్యమేలుతోంది.దేశాలు, ప్రాంతాల మధ్య వైరాలు పెరుగుతున్నాయి.రానురాను మనుషుల మధ్య ప్రేమానురాగాలు, మైత్రీ సంబంధాలు తగ్గుతున్నాయి.అందుకే మన జాతిపిత చెప్పిన అహింసా మార్గాన్ని ప్రపంచ పటంలో చాలాదేశాలు అనుసరించడానికి నడుం బిగించాయి.కానీ మనదేశం ఆ దిశగా కృషిచేయడం లేదు.[1] అందుకే 2004 లో ‘మహాత్మాగాంధీ తత్వ విశ్వవిద్యాలయ ఆకాంక్ష సమితి’ ఏర్పాటు చేశాను.మన దేశంలో ఐదు రాష్ట్రాల్లో గాంధీ విశ్వవిద్యాలయాలున్నాయి.కానీ గాంధీతత్వంపై బోధించే అధ్యాపకులు పదిమందికంటే ఎక్కువ లేరు.గ్రీకులు సోక్రటీస్ ఐడియాలజీని ఏథెన్స్ విశ్వవిద్యాలయంలో ప్రచారం చేశారు.
నలంద, తక్షశిల నాటి నాగార్జున విశ్వవిద్యాలయాలు బుద్ధుని బోధనలను విశ్వవ్యాప్తం చేశాయి. దీనివల్ల థాయ్‌లాండ్, కంబోడియా, ఈజిప్టు, మలేషియా వంటి దేశాల్లో బుద్ధుని బోధనలు విస్తారంగా ప్రచారం జరుగుతున్నాయి. దీన్ని గుర్తించిన చైనా మన గాంధీ మార్గాన్ని, తత్వాన్ని ప్రచారం చేసేందుకు గాంధీజీ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తోంది. మరి అలాంటప్పుడు మన దేశ స్వాతంత్య్రం కోసం అహింసా మార్గంలో అవిశ్రాంత కృషి చేసిన బాపూజీ భావజాలాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ఓ ప్రత్యేక యూనివర్శిటీని మనం ఎందుకు ఏర్పాటు చేయకూడదన్నదే నా ప్రశ్న

సాంబశివరావు.

  • మా దంపతుల తదనంతరం స్వాధీనం చేసుకునేలా వీలునామా రాశాను. గాంధీ విశ్వవిద్యాలయానికై తపించిన సంస్థ గౌరవాధ్యక్షులైన శ్రీ గ్రంథి సుబ్బారావు గారి గ్రంథాలయంలో టెండుల్కర్‌ విరచిత మహాత్మ 8 ఆంగ్ల సంపుటాలపై 8 బైండు పుస్తకాలు సంక్షిప్త సమీక్ష రూపంలో ఉన్నాయి. ఏ మహనీయుడు ఈ పవిత్ర విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేస్తాడో ఆ పూజ్య పాదునకూ దీనిని అంకితం చేస్తాం.‘‘కన్ను తెరిస్తే జననం. కనుమూస్తే మరణం, రెప్పపాటే జీవితం’’ భగవంతుడు కరుణించినందున 72 సంవత్సరాలు ఆరోగ్యవంతమైన జీవితం నాది. ఏరెప్ప పాటులో ఈ బుద్బుదం కీర్తిశేషం అవుతుందో తెలియదు. అందుకే నాకు ఈ తొందర.

సాహితీ వ్యాసంగం

[మార్చు]
  • ‘‘గాంధీ మార్గానుయాయి శ్రీ క్రాంతి సాయి’’ మకుటంతో శ్రీ పుట్టపర్తి సాయిబాబాపై శతకం.
  • ‘‘అభ్యుదయ వాదులారా ఏకం కండి!’’ గాంధీయిజం, మార్క్‌సిజంపై సంక్లిప్త తులనాత్మక పరిశీలన.
  • ‘‘సత్యాంజలి’’ వచన కవితల సంకలన గ్రంథం.
  • ఆంధ్ర సాహిత్యం పై గాంధీజి ప్రభావం - పి.హెచ్‌.డి. పరిశోధనాంశం.
  • ఉన్నవ వారి ‘‘మాల పల్లి’’ పై శ్రీ దామరాజు పుండరీకాక్షుని నాటకాల పై విమర్శనాత్మక వ్యాసాలు
  • డి.జె. టెండుల్కర్‌ రచించిన మహాత్మా 8 సంపుటాల పై సంక్షిప్త సమీక్ష అముద్రికం.

మూలాలు

[మార్చు]