Jump to content

యెరెవాన్ సర్కస్

వికీపీడియా నుండి
2017లో యెరెవాన్ సర్కస్

యెరెవాన్ సర్కస్ (ఆర్మేనియన్:Երևանի կրկես) 1930లలో ప్రారంభించబడిన స్వంత భవనం కలిగి స్థిరమైన ఒక సర్కస్ కంపెనీ. ఈ సర్కస్ 1962లో ఆధునీకరించబడింది. 2012 సెప్టెంబరులో ఈ భవనాన్ని కూల్చివేశారు. ఈ సర్కస్ 2017 అక్టోబరులో కొత్త భవనంలో పునఃప్రారంభయ్యింది.

యెరెవాన్ సర్కస్ మొదటి భవనం
External video
Demolition of the roof, 21 July 2012
Complete demolition, 8 September 2012

ఈ సర్కస్ తొలి భవనం 1930లలో పూర్తిగా చెక్కతో నిర్మించడింది. 1939లో దాని స్థానంలో కొత్త భవనం 800 మంది ప్రేక్షకుల సామర్థ్యంతో నిర్మించబడింది. దీనిని నికోఘయొస్ బునియాటియన్రూపకల్పన చేశాడు. ఈ భవనం 1962లో వఘర్షక్ బెలుబెకియన్ ప్రాజెక్ట్ పూర్తిగా పునర్నిర్మించింది. దీని సామర్థ్యాన్ని 700 మందికి తగ్గించారు.[1] ఈ భవనంలో తరువాత ఎటువంటి మార్పులు జరుగలేదు.[2][3]

యెరెవాన్ సర్కస్ 2005 ఆగష్టులో ప్రైవేటీకరణ చేశారు. దీనిని సోస్ పెట్రొస్యాన్ 150 మిలియన్ల ఆర్మేనియన్ డ్రామ్‌ (AMD)లకు ఖరీదు చేశాడు.[1][2] 2011లో మాస్కోలో నివసిస్తున్న ఆర్మేనియన్ వ్యాపారవేత్త శ్యాంవెల్ కరపెత్యన్ ఈ సర్కస్ అభివృద్ధికి తన సంస్థ తషిర్ గ్రూపు తరఫున 10 మిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించాడు.[1]

2011 ఆగష్టు నెలలో తషిర్ గ్రూప్ మరమ్మత్తు పనులను ప్రారంభించింది.[4] తరువాత ఈ భవనం ఆధునీకరణకు అనుకూలంగా లేదని పూర్తిగా కూల్చివేసి దాని స్థానంలో కొత్త భవంతిని నిర్మించాలని నిర్ణయించుకుంది.[5]ఈ సర్కస్ బిల్డింగ్ పైకప్పును 2012 జూలై 21న కూల్చివేశారు.[2][4] కొన్ని నెలల తర్వాత్ 2012 సెప్టెంబరు 8న మొత్తం భవనాన్ని కూల్చివేశారు[6][7] ఈ కూల్చివేత కార్యక్రమాన్ని ఆర్మేనియా దేశపు అత్యవసర పరిస్థితుల మంత్రిత్వశాఖ పర్యవేక్షించింది.

పునర్నిర్మాణం సందర్భంగా ఈ సర్కస్ జంతువులను తాత్కాలికంగా యెరెవాన్ జూకు తరలించారు.[4]

కొత్త సర్కస్ భవనంలో 1,700 నుండి 2,000 మంది ప్రేక్షకులు ఒకే సారి సర్కస్‌ను చూడవచ్చు.[1] ఈ సర్కస్ క్రింద అండర్‌గ్రౌండ్ పార్కింగ్‌ను నిర్మించారు.[3] 2014లో ఈ భవనం నిర్మాణం పూర్తి అయ్యింది.[3]

ఆర్మేనియన్ సర్కస్ 50వ వార్షికోత్సవం సందర్భంగా 2007లో విడుదలైన తపాలాబిళ్ల

ప్రజాకర్షక సంస్కృతిలో

[మార్చు]

హెన్రిక్ మాల్యన్ అనే ఆర్మేనియన్ దర్శకుడు 1963లో తీసిన రోడ్ టు ద స్టేజ్ అనే సోవియట్ సినిమాలో అనేక దృశ్యాలలో ఈ సర్కస్‌ను చిత్రీకరించారు. ఈ సర్కస్‌కు చెందిన ప్రముఖ ఆర్మేనియన్ విదూషకుడు లియోనిద్ యెంగిబరోవ్ ఈ సినిమాలో నటించాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Երեւանի կրկեսը` կենդանի պատմություն (Living history of the Yerevan Circus)" (in ఆర్మేనియన్). Mediamax. 10 May 2012. Retrieved 9 November 2012.
  2. 2.0 2.1 2.2 "Yerevan circus roof blasted (PHOTO, VIDEO)". News.am. 21 July 2012. Archived from the original on 21 జూన్ 2018. Retrieved 9 November 2012.
  3. 3.0 3.1 3.2 Barseghyan, Anna (20 September 2012). "2014-ին մայրաքաղաքը կունենա ժամանակակից կրկես (Yerevan will have a modern circus by 2012)" (in ఆర్మేనియన్). Radio Free Europe/Radio Liberty. Retrieved 9 November 2012.
  4. 4.0 4.1 4.2 "Yerevan circus dome detonated". PanARMENIAN.Net. 21 July 2012. Retrieved 9 November 2012.
  5. Gyozalyan, Hasmik (8 September 2012). "Կրկեսը կդառնա լավագույն մշակութային օջախներից մեկը (Yerevan Circus will become one of the best cultural centers)" (in ఆర్మేనియన్). Avangard. Retrieved 9 November 2012.
  6. "Yerevan circus building demounted (video)". Tert.am. 8 September 2012. Archived from the original on 24 అక్టోబరు 2014. Retrieved 9 November 2012.
  7. "Circus building blown up in Yerevan - VIDEO and PHOTO". News.am. 8 September 2012. Archived from the original on 22 అక్టోబరు 2012. Retrieved 9 November 2012.