Jump to content

యెహూషువ

వికీపీడియా నుండి
యెహోషువ ఒక రోజంతా సూర్యుడిని ఆపి గిబియోను యుద్ధంలో ఇశ్రాయేలీయులకు విజయం సాధించడం

యెహోషువ గ్రంథ రచయిత యెహోషువ.[1] ఈ గ్రంథం క్రీ. పూ. 1406లో రాయబడినది. ఇందులో మోషే మరణానంతరం యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు కనాను దేశాన్ని జయించడం, దేవుడు వాగ్దానం చేసిన భూమిని పన్నెండు గోత్రాలకు పంచిన విధానం, యెహోషువ చివరి మాటలు వంటివి వివరించబడ్డాయి.[2]

సంఖ్యాకాండము 13:1 ప్రకారం,[3] కనాను దేశాన్ని వేగుచూడటానికి మోషే పంపించిన పన్నెండు మంది ఇశ్రాయేలీయులలో యెహోషువ ఒకడు. మోషే మరణానంతరం యెహోషువ కనానును జయించి ఇశ్రాయేలీయులకు నాయకత్వం వహిస్తాడు. యెహోషువ మోషేకు వారసుడు. ఇశ్రాయేలు తెగలను వాగ్దాన దేశంలోకి నడిపించి, యెహోషువ వారికి భూములను పంచిపెడతాడు. బైబిల్ కాలక్రమం ప్రకారం యెహోషువ జీవించిన కాలం కాంస్య యుగానికి చెందింది. యెహోషువ గ్రంథం 24:29 ప్రకారం, యెహోషువ 110 సంవత్సరాల వయస్సులో మరణించాడు.[4]

ముస్లింలు యెహోషువను(అరబిక్‌లో యుషా బిన్ నూన్) మోషే మరణం తరువాత విశ్వాసులకు నాయకుడిగా, ఖురాన్ ప్రకారం మోషేతో పాటు ఉన్న వ్యక్తిగా గౌరవిస్తారు. [5]

యెహోషువ సమాధి

[మార్చు]

సమారిటన్, యూదు సంప్రదాయాలు

[మార్చు]

1877 లో గుర్తించబడిన సమారిటన్ సంప్రదాయం ప్రకారం, యెహోషువ, కాలేబు సమాధులు కిఫ్ల్ హారిస్‌లో ఉన్నాయి.

యెహోషువ గ్రంథం 24:30 ప్రకారం,[6] యెహోషువ సమాధి తిమ్నాథ్-హెరెస్‌లో ఉంది. యూదు సంప్రదాయం ప్రకారం యెహోషువ తండ్రి నూన్, అతని సహచరుడు కాలేబు సమాధులు కూడా ఆ స్థలంలోనే ఉన్నాయని నమ్ముతారు. దీనిని ఆర్థడాక్స్ యూదులు కిఫ్ల్ హారిస్‌తో పోల్చుతారు. యూదులు ఆ స్థలాన్ని పవిత్ర స్థలంగా భావిస్తారు. హీబ్రూ క్యాలెండర్‌లోని నీసాన్ నెల 26వ తేదీన యెహోషువ మరణ వార్షిక జ్ఞాపకార్థంగా జరుపుకుంటారు. ఆ రోజున వేలాది మంది ప్రజలు ఈ సమాధులను.చూడటానికి వస్తారు.

పాత యూదు సంప్రదాయాల ప్రకారం, యెహోషువ సమాధి ఎగువ గలిలయలోని మెరోలో ఉంది. [7]

మూలాలు

[మార్చు]
  1. Bible నూతన ప్రపంచ బైబిల్ అనువాదము.
  2. "Conjugation of לְהוֹשִׁיעַ". Pealim.
  3. Michaelson, Jay (2020-12-31), "sixteen. Into Life: The Humanism of the Exodus", Torah Queeries, New York University Press, pp. 89–92, ISBN 978-0-8147-8524-9, retrieved 2025-12-10{{citation}}: CS1 maint: work parameter with ISBN (link)
  4. Khan, Geoffrey (2020). The Tiberian Pronunciation Tradition of Biblical Hebrew, Volume 1. Open Book Publishers. ISBN 978-1783746767.
  5. "Strong's Hebrew Concordance - 3091. Yehoshua". Bible Hub.
  6. "+ The Witness of the Stone That Heard". Reading the Bible amid the Environmental Crisis: 11–30. 2024. doi:10.5040/9798216430742.ch-1.
  7. Winterfeldt, Ekkehard (2007). "Summary". HETEROCYCLES. 74 (1): 15. doi:10.3987/com-08-s(w)summary. ISSN 0385-5414.
"https://te.wikipedia.org/w/index.php?title=యెహూషువ&oldid=4799148" నుండి వెలికితీశారు