రంగుటద్దాల కిటికీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రంగుటద్దాల కిటికీ ప్రముఖ బ్లాగర్, రచయిత ఎస్.నారాయణస్వామి రచించిన కథల సంపుటం. ఈ సంపుటంలోని పలు కథలను డయాస్సోరా సాహిత్యంగా విమర్శకులు వర్గీకరించారు.

రచనల నేపథ్యం

[మార్చు]

తెలుగు బ్లాగర్ గా "కొత్తపాళీ" కలంపేరుతో సుప్రసిద్ధులైన ఎస్.నారాయణస్వామి అమెరికాలోని డెట్రాయిట్లో ఇంజనీరుగా పనిచేస్తున్నారు. భారతదేశం నుంచి అమెరికా వెళ్లి అక్కడ స్థిరపడేక్రమంలో తొలితరం ప్రవాసులకు ఎదురయ్యే సాంస్కృతిక సమస్యల గురించి చిత్రీకరించారు ఈ కథలలో. కథలను ప్రచురించిన వేదికలు కూడా ఎక్కువగా అచ్చులో కాక ఎలక్ట్రానిక్ మాసపత్రికలను ఎంచుకున్నారు.

ఇతివృత్తాలు

[మార్చు]

రంగుటద్దాల కిటికీ 21 కథల సంకలనంగా వెలువడింది. వేర్వేరు ఇతివృత్తాలతో రాసిన కథలయినా ఎక్కువగా అమెరికాలోని తెలుగువారికి జీవితంలో ఎదురయ్యే సాంస్కృతిక సమస్యలు వాటి వెనుక తాత్త్విక నేపథ్యాల చుట్టూ అల్లుకున్నాయి. అతితక్కువ కథలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ను నేపథ్యంగా ఎంచుకున్నవి ఉన్నాయి.
వీరిగాడి వలస కథలో ప్రధాన పాత్ర రాఘవరావు అమెరికాలో తన కొడుకు, కోడలు, మనవడితో ఉండేందుకు వస్తారు. దగ్గరలోనే ఉన్న సరస్సులో ఓ బాతుకు వీరిగాడనే పేరు పెట్టి ఆ బాతుతోనూ, స్నేహంగా మాట్లాడే ఓ అమెరికన్ యువతితోనూ స్నేహం చేస్తారు. అతని స్నేహాన్ని అపార్థం చేసుకుని, అదుపుచేసే ప్రయత్నం చేయబోయిన కొడుకు, కోడళ్లకు ఆయన ఎలా బుద్ధిచెప్పారన్నదే ఇతివృత్తం.
తుపాకీ కథలో అమెరికాలోని తుపాకీ సంస్కృతి, జాత్యహంకారాలను ముడివేసి చర్చిస్తారు.

శైలి, శిల్పం

[మార్చు]

ప్రాచుర్యం

[మార్చు]

ఇతరుల మాటలు

[మార్చు]
  • ఎన్నారై సాహిత్యమనగానే అక్కడి వాతావరణాన్నో,రోడ్లనో, మాల్స్ నో,లేక జీవన విధానాన్నో కళ్ళకు కట్టినట్టు చూపించాలని రచయితలు పడే తాపత్రయం, నారాయణ స్వామి గారు పడకపోవడం ఈ కథల్లో ముఖ్యంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కథల్లో జీవితం, అందులోని పాత్రలతో పాటు విదేశీ వాతావరణం కథకు అనుసంధానంగా అంతర్లీనంగా కనిపిస్తుందే తప్ప అదే ప్రముఖ పాత్ర వహించదు. - సుజాత
  • నాసీ(నారాయణ స్వామి) కథల్లో చదివించే గుణం ఉంది. కథ ఎత్తుగడ ఉత్కంఠభరితంగా ఉంటుంది. యదుకుల భూషణ్‌గారు కథకు ప్రాణం అని చెప్పే వాతావరణ కల్పన, దానితోపాటు తప్పకుండా ఉండాల్సిందేనని నేను చెప్పే వస్తువు తన కథల్లో ఉంటాయి. కథలన్నీ ఒకే పద్ధతిలో ఉండవు. వైవిధ్యమున్న ఇతివృత్తాల్ని తీసుకొని, వస్తువునిబట్టి కథ చెప్పే టెక్నిక్‌ని మార్చుకొంటూ ఉంటాడు. తనకు తెలిసిందంతా కథలో చొప్పించాలన్న లౌల్యం లేదు. అవసరమైనదానికన్నా కథని పొడిగించాలన్న తాపత్రయమూ తక్కువే. కథ అందంగా తయారు చేయటంలో శ్రద్ధ వహిస్తాడు. అందుచేత సాధారణంగా నాసీ రాసిన కథలేవీ నాసిగా ఉండవు. సులువుగా చదివేసుకోవచ్చు. - జంపాల చౌదరి

మూలాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]