రక్త వర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రక్త రకం (లేదా రక్త సమూహం) ఎర్ర రక్త కణాలపై ఉన్న ABO రక్త సమూహ యాంటిజెన్లచే కొంతవరకు నిర్ణయించబడుతుంది.

1900 సంవత్సరం లో కారల్ ల్యాండ్ స్టీనర్ అను శాస్త్రవేత రక్త వర్గాలను కనుగొన్నాడు. రక్తాన్ని తీసుకొనే వ్యక్తిని గ్రహిత అని, ఇచ్చే వ్యక్తిని దాత అని అంటారు.రక్త వర్గాలపైన అధికంగా పరిశోధన చేసిన లాండ్ స్టీనర్ ని "ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ గా పిలుస్తారు.ఇతని జన్మదినమైన జూన్ 14 ను ప్రపంచ రక్తదాన దినోత్సవంగా జరుపుకుంటారు.

మానవుల్లో 4 రక్త వర్గాలు

[మార్చు]
  • రక్త వర్గం : ఎ
  • రక్త వర్గం : బి
  • రక్త వర్గం : ఎబి
  • రక్త వర్గం : ఓ
రక్తం లో వర్గాలు రక్త దాతలు
O− O+ A− A+ B− B+ AB− AB+
O− Green tickY Red XN Red XN Red XN Red XN Red XN Red XN Red XN
O+ Green tickY Green tickY Red XN Red XN Red XN Red XN Red XN Red XN
A− Green tickY Red XN Green tickY Red XN Red XN Red XN Red XN Red XN
A+ Green tickY Green tickY Green tickY Green tickY Red XN Red XN Red XN Red XN
B− Green tickY Red XN Red XN Red XN Green tickY Red XN Red XN Red XN
B+ Green tickY Green tickY Red XN Red XN Green tickY Green tickY Red XN Red XN
AB− Green tickY Red XN Green tickY Red XN Green tickY Red XN Green tickY Red XN
AB+ Green tickY Green tickY Green tickY Green tickY Green tickY Green tickY Green tickY Green tickY

[1][2]

విశ్వధాతలు (Oగ్రూప్)

[మార్చు]

రక్తవర్గంగల వ్యక్తుల్లో వారి రక్తకణాలమీద ప్రతిజనకాలు (Antigens) ఉండవు. అందుచేత గ్రహీతలలో రక్తకణాల గుచ్చకరణం ఏర్పడదు. అందుచేత 'O' గ్రూప్ రక్తం గల వ్యక్తి ఏ గ్రూప్ వానికైనా రక్తాన్ని దానం చేయవచ్చు. అందువల్ల 'O' గ్రూప్ గల వారిని విశ్వధాతలు అంటారు.

విశ్వ గ్రహీతలు (AB గ్రూప్)

[మార్చు]

AB రక్త వర్గంగల వ్యక్తుల ప్లాస్మాలో ప్రతిరక్షకాలు (ఏంటీబాడీస్) ఉండవు. అందుచేత వీరి రక్తం, ఇతరవర్గాల రక్తంతో చర్య జరపదు.కాబట్టి AB రక్త వర్గంగల వ్యక్తులు ఇతర వర్గాల (A,B,AB,O) రక్తాన్ని గ్రహించవచ్చు. అందువల్ల వీరిని విశ్వగ్రహీతలు పిలిస్తారు.

Rh కారకము

[మార్చు]

మానవునిలో, Rhesus కోతులలో Rh కారకాన్ని లాండ్స్టీనర్, అలెగ్జాండర్ వీనర్ శాస్త్రవేత్తలు గుర్తించారు. Rhesus పేరులోని మొదటి రెండ అక్షరాలు మీదుగా Rh పెట్టారు. ఈ RH లో రక్త కణాలు ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నట్లయితే Rh+ అని, లేనట్లయితే Rh- పిలుస్తారు.

రక్త దాతలు

[మార్చు]

ఆరోగ్యవంతులైన వ్యక్తులు 16- 50 సంవత్సరాల మధ్య వయసున్న(స్త్రీ, పురుషులిద్దరూ) రక్తదానం చేయవచ్చు.ఒక వ్యక్తి నుండి రక్తాన్ని ధమని నుండి తీసి మరో వ్యక్తికి సిరకు ద్వారా రక్తాన్ని ఎక్కిస్తారు.రక్తదానం చేసేటప్పుడు దాతకు అంటువ్యాధులు ఉండకూడదు. వారికి హెపటైటిస్‌, ల్యుకేమియా, ఎయిడ్స్‌ మొదలైన వ్యాధులు ఉండకూడదు. ఒక వ్యక్తి 3 నెలల నుంచి 4 నెలలకోసారి రక్తదానం చేయోచ్చు.

మూలాలు

[మార్చు]
  1. "RBC compatibility table". American National Red Cross. December 2006. Archived from the original on 2007-08-04. Retrieved 2008-07-15.
  2. Blood types and compatibility Archived 2010-04-19 at the Wayback Machine bloodbook.com