Jump to content

రచిన్ రవీంద్ర

వికీపీడియా నుండి
రచిన్ రవీంద్ర
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1999-11-18) 1999 నవంబరు 18 (వయసు 25)
వెల్లింగ్టన్, న్యూజిలాండ్
బ్యాటింగుఎడమ చేతి వాటం
బౌలింగుఎడమ చేతి వాటం
మూలం: Cricinfo, 2021 3 డిసెంబర్

రచిన్ రవీంద్ర (జననం 1999 నవంబరు 18) న్యూజిలాండ్ క్రికెటరు.[1] అతను 2021 సెప్టెంబరులో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

రవీంద్ర న్యూజిలాండ్, వెల్లింగ్టన్‌లో భారతీయ తల్లిదండ్రులకు జన్మించాడు.[2] అతని తండ్రి రవి కృష్ణమూర్తి న్యూజీలాండ్‌లో స్థిరపడ్డ సాఫ్ట్‌వేరు ఆర్కిటెక్టు. అతను బెంగళూరులో ఉండగా క్లబ్ క్రికెట్ ఆడేవాడు.[3] రవీంద్ర తాత, ప్రముఖ బయాలజీ ప్రొఫెసరైన టిఎ. బాలకృష్ణ ఆడిగ. రచిన్ తండ్రికి ఇష్టమైన క్రికెటర్లు రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్‌లు. రాహుల్ లోని ను, సచిన్ లోని చిన్ లను కుమారుడికి రచిన్ అనే పేరు పెట్టాడు. [4]

కెరీర్

[మార్చు]

అతను 2016 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్, 2018 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ న్యూజిలాండ్ జట్టులో చోటు సంపాదించాడు. 2018 జూన్‌లో 2018–19 సీజన్ కు వెల్లింగ్టన్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. [5]

లిస్ట్ ఎ

[మార్చు]

అతను అక్టోబరు 21 న పాకిస్తాన్ ఎతో న్యూజిలాండ్ ఎ తరఫున లిస్ట్ ఎ రంగప్రవేశం చేశాడు. 2018 అక్టోబరు 30 న పాకిస్తాన్ ఎ పైనే న్యూజిలాండ్ ఎ తరఫున ఫస్ట్ క్లాస్ రంగప్రవేశం కూడా చేశాడు. 2019–20 ఫోర్డ్ ట్రోఫీలో ఆక్లాండ్ పై వెల్లింగ్టన్ తరఫున రవీంద్ర లిస్ట్ ఎ క్రికెట్ లో తన మొదటి సెంచరీని సాధించాడు. 2020 మార్చిలో 2019–20 ప్లుంకెట్ షీల్డ్ సీజన్ లో ఆరవ రౌండ్ లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో తన తొలి సెంచరీని సాధించాడు. [6]

జూన్ 2020లో 2020-21 దేశీయ క్రికెట్ సీజన్ కు ముందు వెల్లింగ్టన్ అతనితో ఒప్పందం కుద్ర్చుకుంది. 2020 నవంబరులో, పర్యటనలో ఉన్న వెస్టిండీస్ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్‌ల కోసం న్యూజిలాండ్ ఎ క్రికెట్ జట్టులో రవీంద్ర ఎంపికయ్యాడు. [7] మొదటి ప్రాక్టీస్ మ్యాచ్ లో రవీంద్ర 112 పరుగులతో సెంచరీ సాధించాడు. [8]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

ఏప్రిల్ 2021లో ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు, 2019-21 ఐసిసి వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు న్యూజిలాండ్ టెస్టు జట్టులో రవీంద్ర ఎంపికయ్యాడు. పాకిస్తాన్ పర్యటన కోసం న్యూజిలాండ్ వన్డే జట్టులో ఎంపికయ్యాడు. బంగ్లాదేశ్ తో 2021 సెప్టెంబరు 1న తన తొలి టీ20 ఆడాడు.[9]

2021 నవంబరులో భారత్ తో జరిగిన సిరీస్ కు న్యూజిలాండ్ టెస్టు జట్టులో రవీంద్ర ఎంపికయ్యాడు. 2021 నవంబరు 25 న భారత్‌పై తొలి టెస్టు ఆడాడు.[10]

మూలాలు

[మార్చు]
  1. "20 cricketers for the 2020s". Cricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-12-05.
  2. "Meticulous Rachin building on father's cricket genes". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-12-05.
  3. "Meticulous Rachin building on father's cricket genes". ESPN Cricinfo. Retrieved 28 December 2020.
  4. "ఇంగ్లండ్‌కే చుక్కలు చూపించాడు.. ఎవరీ రచిన్‌ రవీంద్ర? భారత్‌తో సంబంధం ఏంటి?". సాక్షి. 2023-10-06. Archived from the original on 2023-10-06. Retrieved 2023-10-06.
  5. "Central Districts drop Jesse Ryder from contracts list". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-12-05.
  6. "Plunket Shield: Devon Conway and Rachin Ravindra put table-topping Firebirds in control". Stuff (in ఇంగ్లీష్). 2020-03-11. Retrieved 2021-12-05.
  7. "Auckland lose Jeet Raval to Northern Districts, Finn Allen to Wellington in domestic contracts". Stuff (in ఇంగ్లీష్). 2020-06-15. Retrieved 2021-12-05.
  8. "Black Caps vs West Indies: Rachin Ravindra century gives New Zealand A control over tourists". Stuff (in ఇంగ్లీష్). 2020-11-20. Retrieved 2021-12-05.
  9. "Full Scorecard of New Zealand vs Bangladesh 1st T20I 2021 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-12-05.
  10. "Full Scorecard of India vs New Zealand 1st Test 2021/22 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-12-05.