రతిప్రవృతి
స్వరూపం
ఈ వ్యాసం 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే. లైంగికత గురించి చర్చించటం మూలాన ఈ వ్యాసం చదవటం అందరికీ అమోదయోగ్యం కాకపోవచ్చును . ఇది మీకు సౌకర్యవంతం కాకపోతే దయచేసి తక్షణమే ఈ పుట నుండి నిష్క్రమించ ప్రార్థన. |
రతి ప్రవృతి, ఒక వ్యక్తి (స్త్రీ గానీ, పురుషుడు గాని) తనలోని సంభోగేచ్చను తీర్చుకోవడానికి యెన్నుకునే బాగస్వామి యొక్క లింగం మీద ఆదారపడి వుంటుంది. దీన్నే ఆంగ్లంలో Sexual orientation ఆంటారు. అంటే, ఒక వ్యక్తి, పరపరాగ సంపర్కి కావచ్చు, స్వపరాగ సంపర్కి కావచ్చు, లేదా స్వ, పరపరాగ సంపర్కి కావచ్చు లేదా అసలు లైంగికేచ్చ లేని వ్యక్తి కావచ్చు.
రతి ప్రవృతి క్షుణ్ణంగా:
- పర పరాగ లక్షణం (heterosexuality|heterosexual) : వీరు ఇతర లింగవ్యక్తులచే ఆకర్షింప బడతారు.
- స్వపరాగ లక్షణం (homosexuality|homosexual) : వీరు స్వలింగ సంపర్కులు.
- స్వ-పర పరాగ లక్షణం (bisexuality|bisexual) : వీరు స్వ, పర లింగవ్యక్తులచే ఆకర్షింపబడతారు.
- ఝడలక్షణం (asexuality|asexual) వీరు సంభోగేచ్చ లేని వారు అందుకే ఎవ్వరిచే ఆకర్షింపబడరు.
పై లక్షణాలు కాక రతి ప్రవృతి లక్షణాలు ఇలా కూడా కొంతమందిలో వుంటుంది:
- తాము ఇతర లింగవ్యక్తులుగా గట్టి నమ్మకం కలవారు. వీరిని ఆంగ్లంలో transgender లేదా transsexual అంటారు. పుట్టడం మగవాడిగా అయినా తాను స్త్రీనని మానసికంగా గట్టిగా నమ్మి స్త్రీలాగా దుస్తులు దరించి, నడక, నదివడకలో స్త్రీలాగా ప్రవర్తించే వారు ఈ కోవలోకి వస్తారు. అదేవిథంగా జన్మత స్త్రీగా పుట్టినా, మగవాడిలా ఫీలయి, అలాగే ప్రవర్తించే "టాంబాయ్" స్త్రీలూ వున్నారు.