రతీంద్రనాథ్ ఠాగూర్
Jump to navigation
Jump to search
రతీంద్రనాథ్ ఠాగూర్ | |
---|---|
রথীন্দ্রনাথ ঠাকুর | |
జననం | రతీంద్రనాథ్ ఠాకూర్ 1888 నవంబరు 27 కలకత్తా, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం పశ్చిమ బెంగాల్) |
మరణం | 1961 జూన్ 3 | (వయసు 72)
జాతీయత | భారతీయుడు |
విద్యాసంస్థ | ఇల్లినోయ్ విశ్వవిద్యాలయం |
జీవిత భాగస్వామి | ప్రతిమా దేవి |
భాగస్వామి | మీరా ఛట్టోపాధ్యాయ్ |
పిల్లలు | నందిని (దత్తత) జయబ్రతో (పెంపుడు సంతానం) |
తల్లిదండ్రులు | రవీంద్రనాథ్ ఠాగూర్ (తండ్రి) మృణాళిని దేవి (తల్లి) |
రతీంద్రనాథ్ టాగూర్ (1888 నవంబరు 27 - 1961 జూన్ 3) భారతీయ విద్యావేత్త, వ్యవసాయవేత్త, చిత్రకారుడు, తోలు బొమ్మలు, చెక్కబొమ్మల కళాకారుడు.[1][2][3] ఈయన తన తండ్రి రవీంద్రనాథ్ టాగూర్ స్థాపించిన విశ్వభారతి విశ్వవిద్యాలయానికి మొదటి ఉపకులపతిగా పనిచేశాడు.
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]రతీంద్రనాథ్ ఠాగూర్ 1888న, నవంబర్ 27 తేదీన రవీంద్రనాథ్ ఠాగూర్, మృణాళిని దేవి దంపతులకు బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్ ప్రెసిడెన్సీలోని కలకత్తాలోని జోరాసంకో ఠాకూర్ బారీలో జన్మించారు.[4]
అతను శాంతినికేతన్‌లోని బ్రహ్మచర్య ఆశ్రమంలో మొదటి ఐదుగురు విద్యార్థులలో ఒకడు.[5] పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత, అతను మరియు సహవిద్యార్థి సంతోష్ చంద్ర మజుందార్‌ను 1906లో జపాన్‌కు పంపారు. అక్కడి నుండి అమెరికాకు వెళ్లి 1909లో ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం నుండి వ్యవసాయ శాస్త్రంలో పట్టభద్రులయ్యాడు.[4][5][6]
మూలాలు
[మార్చు]- ↑ "Rathindranath Tagore - Woodworker". Archived from the original on 17 August 2023. Retrieved 17 August 2023.
- ↑ "Rabindranath Tagore & Rathindranath Tagore Exhibition Catalogue 1932" (PDF). Archived (PDF) from the original on 17 August 2023. Retrieved 17 August 2023.
- ↑ "STELLA KRAMRISCH ON RATHINDRANATH TAGORE's ART AND EXHIBITION CATALOGUE". Prinseps. 20 April 2020. Archived from the original on 16 March 2022. Retrieved 16 March 2022.
- ↑ 4.0 4.1 কবিপুত্র [Kabiputra]. Anandabazar Patrika (in Bengali). 18 February 2017. Archived from the original on 1 June 2019. Retrieved 1 June 2019.
- ↑ 5.0 5.1 "Rathindranath Tagore". www.visvabharati.ac.in. Archived from the original on 15 July 2019. Retrieved 10 June 2019.
- ↑ "Santoshchandra Majumdar". www.visvabharati.ac.in. Archived from the original on 14 November 2019. Retrieved 10 June 2019.