రత్నావళి
రత్నావళి | |
కృతికర్త: | శ్రీహర్షుడు |
---|---|
అనువాదకులు: | మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి |
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | నాటకం |
విభాగం (కళా ప్రక్రియ): | అనువాద సాహిత్యం |
ప్రచురణ: | యస్. గున్నేశ్వరరావు బ్రదర్స్, రాజమండ్రి |
విడుదల: | 1947 |
పేజీలు: | 74 |
రత్నావళి అనే అందమైన రాజకుమారి, ఉదయుడనే గొప్ప రాజు మధ్య జరిగిన ఇతివృత్తంగా అజ్ఞాత సంస్కృత నాటక రచయిత రత్నావళి నాటకాన్ని రచించారు. దాని కర్తగా నాటి భారత చక్రవర్తి హర్షుని పేరు పెట్టారని పండితుల అభిప్రాయం. నాటకంలో నాల్గంకాలు ఉన్నాయి. సాహిత్యంలో హోలీ పండుగను నమోదు చేసిన తొలి సాహిత్యం రత్నావళి నాటికే. ఈ నాటికను మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి తెలుగులోకి అనువదించారు.
దీనిని శ్రీ చింతామణి ప్రెస్, రాజమండ్రి లో ముద్రించబడి, యస్.గున్నేశ్వరరావు బ్రదర్స్, రాజమహేంద్రవరము వారి ద్వారా 1947 సంవత్సరంలో ప్రచురించారు.
కథాంశం
[మార్చు]యౌగంధరాయలమంత్రి సింహళేశ్వర పుత్రియగు రత్నావళిని తన యేలిక వత్సరాజున కిచ్చి వివాహము చేయదలంచి రత్నావళిని తీసుకొని వచ్చుచుండ త్రోవలో నావ సముద్రములో మునిగిపోయినది. ఆమెకు ఒక పళక దొరకి ఆమె బ్రతికినది. కౌశంబీదేశ వర్తకుకొడకు సింహళద్వీపమునుండి తిరిగివచ్చును మార్గమున రత్నావళిని గుర్తించి ఆమెను యౌగంధరాయనికి ఇచ్చును. అతడామెను వాసవదత్త వద్ద్ న్యాసముగా ఉంచెను. అక్కడ రత్నావళి - వత్సరాజులు పరస్పరము చూచుకొని ప్రేమించుకొనిరి. ఇంద్రజాలము కారణముగా వాసవదత్త రత్నావళిని తన చెల్లెలుగా గుర్తించి ఆమెను వత్సరాజున కర్పించుట ఇందలి ప్రధానమైన కథ.
నాటికలోని పాత్రలు
[మార్చు]- పురుషులు
- వత్సరాజు - కౌశాంబీ నగరాధిపతి
- యౌగంధరాయణుడు - వత్సరాజు మంత్రి
- వసంతుకుడు - విదూషకుడు
- బాభ్రవ్యుడు - వత్సరాజు కంచుకి
- విజయవర్మ - రుమణ్వంతుని మేనల్లుడు
- వసుభూతి - సింహళేశ్వరుని మంత్రి
- ఇంద్రజాలికుడు - శంబర సిద్ధి
- స్త్రీలు
- వాసవదత్త - వత్సరాజు దేవేరి
- సాగరిక - సింహళేశ్వరుని పుత్రిక, రత్నావళి
- కాంచనమాల - వాసవదత్త పుట్టింటి చేటిక, సఖి
- సుసంగత - వాసవదత్తవేటి, సాగరిక ప్రియసఖి
- మదనిక, చూతనిక, నిపుణిక - వాసవదత్త ఇతర చేటికలు
- వసుంధర - ప్రతిహారి