రవి కన్నన్
రవి కన్నన్ భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో ఉన్న కాన్సర్ శస్త్రచికిత్సా వైద్యుడు (సర్జికల్ ఆంకాలజిస్ట్). ఆయన ఉచితంగా క్యాన్సర్ చికిత్సను అందించే లాభాపేక్షలేని ఆసుపత్రి అయిన కచార్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (CCHRC) అధిపతి (డైరెక్టర్).[1] ఆయన చెన్నై అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సర్జికల్ ఆంకాలజీ విభాగానికి మాజీ అధిపతి. ఆయన భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీ, ఆసియాలో అత్యున్నత పురస్కారం అయిన రామన్ మెగసెసే అవార్డు ("నోబెల్ ప్రైజ్ ఆఫ్ ఆసియా " అని పిలువబడుతుంది) గ్రహీత.[2][3]
విద్య
[మార్చు]కన్నన్ చెన్నైలోని కిల్ పాక్ మెడికల్ ఇన్స్టిట్యూట్ నుండి ' ఎంబిబిఎస్' డిగ్రీ పట్టా పొందడం జరిగింది[4]. న్యూఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ నుండి సర్జికల్ అంకాలజీలో మాస్టర్ ఆఫ్ సర్జరీ డిగ్రీని పొందడం జరిగింది.
వృత్తి, ఉద్యోగం
[మార్చు]కన్నన్ చెన్నై లోని అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అంకాలజి విభాగానికి అధిపతిగా ఉన్నాడు.[5] అతను ఒక సహోద్యోగి అభ్యర్థన మేరకు అస్సాం రాష్ట్రంలోని కాచల్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ ను సందర్శించాడు. ఆ సమయంలోనే ఆయన అప్పటి సి.సి.హెచ్.ఆర్.సి అధిపతిని కలుసుకున్నారు. ఆయన ఈ కేంద్రానికి నాయకత్వం వహించాలని ప్రతిపాదించారు.[6] బరాక్ వ్యాలీ ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాలు అందించడానికి కన్నన్ చెన్నైలో విడిచి అస్సాం రాష్ట్రానికి వెళ్లారు.
పురస్కారాలు
[మార్చు]ఇతని సేవలకు గుర్తింపు గాను ఆసియా నోబెల్ పురస్కారంగా పిలిచే రామన్ మెగసెసే అవార్డు 2023వ సంవత్సరంలో అందుకున్నారు. 2020 వ సంవత్సరం జనవరి 26వ తేదీన భారతదేశ నాలుగో అత్యున్నత పురస్కారం పద్మశ్రీని అందుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇతను చేసిన వైద్య సేవలకు గానూ 2013 వ సంవత్సరంలోభారత ఉపరాష్ట్రపతి మహ్మద్ హమీద్ అన్సారీ 2013లో మహావీర్ పురస్కారాన్ని అందజేశారు[7].
మూలాలు
[మార్చు]- ↑ "Dr. Ravi Kannan, Director of Cachar Cancer Hospital and Research Centre felicitated at Silchar – Sentinelassam". The Sentinel (Guwahati) (in ఇంగ్లీష్). 2020-02-06. Retrieved 2020-10-30.
- ↑ "Meet Dr. Ravi Kannan, Padma Shri 2020 awardee who treats cancer patients for free". Daily News and Analysis (in ఇంగ్లీష్). Retrieved 31 January 2020.
- ↑ "R., Ravi Kannan". www.rmaward.asia. Archived from the original on 2023-09-01. Retrieved 2023-09-03.
- ↑ Bureau, The Hindu (2023-08-31). "Oncologist R. Ravi Kannan of the Cachar Cancer Hospital and Research Centre wins 2023 Ramon Magsaysay award". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-09-03.
- ↑ "R., Ravi Kannan". www.rmaward.asia. Archived from the original on 2023-09-01. Retrieved 2023-09-03.
- ↑ Madhavan, Anushree (24 February 2020). "This Chennai doctor who moved to Assam 13 years ago declared Padma Shri recipient for 2020". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 24 February 2020.
- ↑ "Oncologist Ravi Kannan R to be honoured with Ramon Magsaysay Award for pro-poor cancer care". www.telegraphindia.com (in ఇంగ్లీష్). Retrieved 2023-09-03.