రసిక జోషి
రసిక జోషి | |
---|---|
జననం | |
మరణం | 2011 జూలై 7 | (వయసు 38)
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2004–2011 (చనిపోయే వరకు) |
రసిక జోషి (1972 సెప్టెంబరు 12 - 2011 జూలై 7) ) మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, టెలివిజన్, సినిమా నటి. హిందీ, మరాఠీ సినిమాలలో నటించింది.[1]
జననం
[మార్చు]రసిక, 1972 సెప్టెంబరు 12న మహారాష్ట్ర రాజధాని ముంబైలోని మరాఠీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]దర్శకుడు, నటుడు గిరీష్ జోషితో రసిక జోషి వివాహం జరిగింది.[2]
కళారంగం
[మార్చు]అవినాష్ మసురేకర్, స్మితా తల్వాల్కర్ నటించిన ఉంచ మజా జోకా అనే లతా నర్వేకర్ మరాఠీ నాటకంతో తన నటనావృత్తిని ప్రారంభించింది. రామ్ గోపాల్ వర్మ తీసిన నాట్ ఎ లవ్ స్టోరీ సినిమాలో చివరిసారిగా నటించింది. వైట్ లిల్లీ అండ్ నైట్ రైడర్ నాటకానికి రచయితగా, దర్శకుడిగా, నటుడిగా పనిచేసింది.[3]
సినిమాలు
[మార్చు]హిందీ
[మార్చు]- గయాబ్ (2004)
- ఏక్ హసీనా థీ (2004)
- వాస్తు శాస్త్రం (2004)
- దర్నా జరూరీ హై (2006)
- మలమాల్ వీక్లీ (2006)
- డార్లింగ్ (2007)
- జానీ గద్దర్ (2007)
- ధోల్ (2007)
- భూల్ భూలయ్యా (2007)
- డి తాలీ (2008)
- బిల్లు (2009)
- నాట్ ఎ లవ్ స్టోరీ (2011)
టెలివిజన్
[మార్చు]ఘడ్లే బిఘడ్లే, బువా అలా, యే దునియా హై రంగీన్ మొదలైన వాటిలో నటించింది. బందినిలో తరులతగా ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి.
మరాఠీ
[మార్చు]రసిక జోషి చాలా సినిమాలు, నాటకాలు, టెలివిజన్ సీరియల్స్‌లో నటించిన ప్రతిభావంతులైన నటి. యండ కర్తవ్య ఆహే అనే మరాఠీ సినిమాకు రచయితగా పనిచేసింది. స్వయంగా రచించిన, దర్శకత్వం వహించిన వైట్ లిల్లీ & నైట్ రైడర్ అనే నాటకం అనేక అవార్డులు, ప్రశంసలు, ప్రశంసలను గెలుచుకుంది.
మరణం
[మార్చు]రసిక, 38 ఏళ్ల వయస్సులో 2011 జూలై 7న లుకేమియా వ్యాధితో ముంబైలోని ఒక నర్సింగ్‌హోమ్‌లో మరణించింది.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ "Hindi Tv Actress Rasika Joshi Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Archived from the original on 2021-07-24. Retrieved 2022-08-14.
- ↑ "चतुरस्र अभिनेत्री रसिका जोशी यांचे निधन". Lokasatta Marathi. Lokasatta. Retrieved 9 July 2011.
- ↑ "Abir Goswami - Bollywood celebs who passed away too soon". The Times of India. Archived from the original on 2022-08-14. Retrieved 2022-08-14.
- ↑ "Rasika Joshi passes away". From Mumbai Mirror. TOI. 9 July 2011. Retrieved 9 July 2011.
- ↑ "Actor Rasika Joshi dies of cancer". The Indian Express (in ఇంగ్లీష్). 2011-07-15. Archived from the original on 2015-10-26. Retrieved 2022-08-14.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రసిక జోషి పేజీ