రాక్షసి (2019 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2019లో విడుదలయిన సినిమా. ఈ ఫిల్మ్ లో కథానాయిక ఉద్యోగ జీవితం, ఉద్ఎయోగంలో ఎదురయిన సమస్యలు, అసూయపరులు మాటిమాటికి సృస్టించిన అడ్డంకులను అధిగమించడం అన్నీ ప్రేక్షకులు ఆసక్తితో చూస్తారు.

కథానాయిక కోరికోరి గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాల హెచ్.ఎం గా వస్తుంది. బాధ్యత, క్రమశిక్షణ లేని అధ్యాపకులు, యెవ్వరూ పట్టింకునేవాళ్ళు లేక వెనుకబడిపోయిన విద్యార్థులు. హెచ్.ఎం తానూ ఆదర్శంగా ఉంటూ ఒక్కొక్కరిని మారుస్తుంది. కొందరు మార్పును అంగీకరించరు. రాజకీయ నాయకులను ఆశ్రయిస్తారు. ఆ హెచ్.ఎం గొప్ప ఆత్మశక్తితో దుష్టశక్తులను ఎదిరిస్తుంది. కలెక్టరు నిజం తెలుసుకోనోడానికి తనిఖీకి వస్తాడు. స్కూల్ చక్కగా జరగడం చూచి, ఆమె సేవలను అభినందిస్తాడు. ఒక్కొక్క అధ్యాపకుడు, ఉద్యొగులూ క్రమంగా మారుతారు. రాజకీయ నాయకుడి కుమారుడే తన తండ్రిని ఎదిరిస్తాడు. పిల్లలు ఆమె అభిమానులవుతారు.

ఆ మెకూ ఒక వ్యక్తిగత విషాద గాధ ఉందితను ప్రేమించిన ప్రియుడు చనిపోతాడు. ఆమె భారత సైన్యములో Lt Colnol గా పదవీ విరమణ తర్వాత స్చూల్లో పనిచేస్తుంది. వృద్ధుడయిన తండ్రి చనిపోయిన తరువాత ఆమె ఒంటరిగా ఉంటున్న తన ప్రియుని తల్లికి తోడుగా ఉండడానికి నిస్చయించుకోడంతో సినిమా ముగుస్తుంది.

జ్యోతిక నటన సినిమాలో అన్ని లొపాలనూ కమ్మివేసింది. స్క్రీన్ ప్లే మరింత శ్రద్డగా తయారు చేసుకొని వుంటే ఇంకా కళాత్మకంగా ఉండేదని విమర్శకులు అంటారు.