రాక్షసి (2019 సినిమా)
రాక్షసి, 2017 లో విడుదలయిన సినిమా. దర్శకుడు పన్నా రాయల్, ఈ సినిమాలో కథానాయిక ఉద్యోగ జీవితం, ఉద్యోగంలో ఎదురయిన సమస్యలు, అసూయపరులు మాటిమాటికి సృస్టించిన అడ్డంకులను అధిగమించడం అన్నీ ప్రేక్షకులు ఆసక్తితో చూస్తారు.
కథానాయిక కోరికోరి గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాల హెచ్.ఎం గా వస్తుంది. బాధ్యత, క్రమశిక్షణ లేని అధ్యాపకులు, యెవ్వరూ పట్టింకునేవాళ్ళు లేక వెనుకబడిపోయిన విద్యార్థులు. హెచ్.ఎం తానూ ఆదర్శంగా ఉంటూ ఒక్కొక్కరిని మారుస్తుంది. కొందరు మార్పును అంగీకరించరు. రాజకీయ నాయకులను ఆశ్రయిస్తారు. ఆ హెచ్.ఎం గొప్ప ఆత్మశక్తితో దుష్టశక్తులను ఎదిరిస్తుంది. కలెక్టరు నిజం తెలుసుకోనోడానికి తనిఖీకి వస్తాడు. స్కూల్ చక్కగా జరగడం చూచి, ఆమె సేవలను అభినందిస్తాడు. ఒక్కొక్క అధ్యాపకుడు, ఉద్యొగులూ క్రమంగా మారుతారు. రాజకీయ నాయకుడి కుమారుడే తన తండ్రిని ఎదిరిస్తాడు. పిల్లలు ఆమె అభిమానులవుతారు.
ఆ మెకూ ఒక వ్యక్తిగత విషాద గాధ ఉంది, తను ప్రేమించిన వ్యక్తి చనిపోతాడు. ఆమె భారత సైన్యములో Lt Colnol గాచేరి, పదవీ విరమణ తర్వాత స్చూల్లో పనిచేస్తుంది. వృద్ధుడయిన తండ్రి చనిపోయిన తరువాత ఆమె ఒంటరిగా ఉంటున్న తన ప్రియుని తల్లికి తోడుగా ఉండడానికి నిశ్చయించుకోడంతో సినిమా ముగుస్తుంది. సినిమాలో కొన్ని సంఘటనలు వాస్తవానికి చాలా దూరంగా అనిపిస్తాయి. జ్యోతిక నటన అన్ని లొపాలనూ కమ్మివేసింది. స్క్రీన్ ప్లే మరింత శ్రద్డగా తయారు చేసుకొని వుంటే, ఇంకా కళాత్మకంగా ఉండేదని విమర్శకులు అంటారు. ఈ మూవీచూసి ఉపాధ్యాయులు ఆత్మవిమర్శ చేసుకోవలసిన సినిమా.