Jump to content

రాజంపల్లి (పెద్దారవీడు)

అక్షాంశ రేఖాంశాలు: 15°53′35.736″N 79°16′11.100″E / 15.89326000°N 79.26975000°E / 15.89326000; 79.26975000
వికీపీడియా నుండి

రాజంపల్లి ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

రాజంపల్లి (పెద్దారవీడు)
గ్రామం
పటం
రాజంపల్లి (పెద్దారవీడు) is located in ఆంధ్రప్రదేశ్
రాజంపల్లి (పెద్దారవీడు)
రాజంపల్లి (పెద్దారవీడు)
అక్షాంశ రేఖాంశాలు: 15°53′35.736″N 79°16′11.100″E / 15.89326000°N 79.26975000°E / 15.89326000; 79.26975000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంపెద్దారవీడు
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )

గ్రామంలోని దేవాలయాలు

[మార్చు]
  • పెద్దారవీడు మండలంలోని హనుమాన్ జంక్షన్ కుంట పరిధిలోని రాజంపల్లి గ్రామ సమీపంలోని గొడ్రాలికొండ శ్రీ తిరుమలనాధస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రతి సంవత్సరం, జ్యేష్ట శుద్ధ పూర్ణిమ నుండి 9 రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. 2014 లో, జూన్-12 గురువారం తెల్లవారుఝాము నుండి ప్రారంభించి, 20వ తేదీ వరకు నిర్వహించెదరు. 18వ తేదీన రథోత్సవం నిర్వహించెదరు. ఈ ఉత్సవాల సందర్భంగా రాష్ట్రస్థాయి ఎడ్ల బలప్రదర్శనలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేసెదరు.
    • గొడ్రాలికొండ - చారిత్రక ఆధారాలు
    • ప్రకాశం జిల్లా పెద్దారవీడి మండలం రాజంపల్లి గ్రామ సమీపంలో వెలసి యున్నది *"గొడ్రాలికొండ"*.ఇక్కడ రాజ్యలక్ష్మి సమేతుడై ' *తిరుమలనాధ* స్వామి'వారు వేంచేసి యున్నారు.భక్తులపాలిట కొంగు బంగారమై, కోర్కెలుదీర్చెడి దైవమై నిత్యపూజలందుకుంటున్న వైష్ణవక్షేత్రం.ముఖ్యంగా సంతులేనివారికి సంతానమిచ్చి గొడ్రాలిని సైతం చంకబిడ్డలనెత్తుకొనే భాగ్యం  కలిగించే పరమ పవిత్ర స్తానంబిది. ఈ ప్రాంతాల్లో *గొడ్రాలికొండ,* *బొల్లికొండ* , *వెలుగొండ,* *మాలకొండ* వైష్ణవక్షేత్రంబులై అలరారుచున్నవి. ఈ  ఆలయంగురించి ఈ ' *గొడ్రాలికొండ* ' గురించి రకరకాల కధలున్నన, ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారో సరైన ఆధారములు, శాసనాలు లభ్యం కాకున్నవి.        అయితే ఈమధ్యకాలంలో పెద్దారవీడు మండలంలో *'గొడ్రాలికొండ'* కు దగ్గరలో  *"పోతంపల్లి* " గ్రామ సమీపంలో ఓ శాసనం బయల్పడినది.(తురిమెళ్ళ శ్రీనివాసప్రసాద్ కనుగొన్నది) ఈశాసనం కాకతీయ                         " *ప్రతాపరుద్రుని* " కాలంనాటి శాలివాహనశకం ౧౨౪౦ (1240) నాటిది. అనగా నేటి సాదారణవత్సరం ౧౩౧౮(1318).పదనాల్గో శతాబ్ధంనాటిది. "ప్రతాపరుద్రు"ని మహాసేనాని,సామంతరాజు అయిన " *దేవరి నాయనిం* "గారు ఈశాసనాన్ని లిఖించారు. ఈయన 1318(౧౩౧౮) వ సంవత్సరంలో 'ప్రతాపరుద్రు'ని మరియు తనతండ్రికి పుణ్యంగా, త్రిపురాంతకంలోని " *త్రిపురాంతకేశ్వరు* "నికి నిత్య నైవేద్యాలకు మరియు అంగరంగ వైభోగాలకు " *పోతనపల్లి* " (పోతంపల్లి)గ్రామాన్ని సకలాయ సహితముగా సర్వమాన్యములను దానం చేసినట్లు ఈ శాసనంలో లిఖించారు.అందులో _పోతంపల్లి_ గ్రామ సరిహద్దులను తెలియపరుస్తూ తూర్పున _గొడ్రాలికొండ_ ను కనపరిచారు. పై 1318 వ సంవత్సరపు శాసనాన్ని బట్టి ఈ గొడ్రాలికొండ పదునాల్గవ శతాబ్ధంనాటికే పేరు ప్రఖ్యాతలు సంతరించుకొందని తెలియుచున్నది. రాజయ్య,రాజమ్మ అనేదంపతులకు సంతునివ్వగా గుడి నిర్మించారనివారి పేరునే రాజంపల్లి గ్రామమేర్పడినదని ఓ కధ ప్రచారంలో ఉంది. మరొక శాసనం స్వామి వారి ముందరి ద్వారము పైన లిఖించబడి యున్ననూ అక్షరములు అర్ధం కాకున్నవి. *ఉత్పలమాల* పూచినపూలనేరుకొని పూజలుచేయగ రెండుచేతులన్ సాచి నమస్కరించి మనసారగ నిల్చితిమయ్య భక్తితో నీచిరునవ్వు వెన్నెలలు నిండిన సత్కరుణారసంబు దే వా చిలికింపు మాపయి కృపామయ తిర్మలనాధశ్రీవిభూ!!! (ఆరాటి)

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]