రాజగోపాలవిలాసము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజగోపాలవిలాసము, పుస్తక ముఖచిత్రం.

రాజగోపాలవిలాసము 17వ శతాబ్దానికి చెందిన ఒక తెలుగు పద్యరచన. దీనిని విజయరాఘవ నాయకుని ఆస్థానకవి యైన చెంగల్వ కాళయ రచించెను. రచయిత తన కృతిని తంజావూరు నాయకరాజైన విజయరాఘవ నాయకుడు అంకితమిచ్చెను.

దీనిని మొదటిసారి తంజావూరు సరస్వతీ మహల్ గ్రంథాలయం వారు 1951 ముద్రించి ప్రచురించారు. నిడుదవోలు వెంకటరావు విపులమైన పీఠికను ఆంగ్ల-తెలుగు భాషలలో అందించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు.

విషయ సంగ్రహం[మార్చు]

ఈ పద్యకావ్యం ఐదు ఆశ్వాసాలుగా రచించబడినది. వీనిలో రాజగోపాలునిగా పేర్కొన్న శ్రీకృష్ణుని అష్టమహిషులను శృంగార నాయికలుగా కీర్తించబడ్డారు.

  • స్వీయ- రుక్మిణి
  • జారిణి-భద్ర
  • జారిణి-లక్షణ
  • విప్రలబ్ద- జాంబవతి
  • ఖండిత-మిత్రవింద
  • విరహోత్కంఠిత-సుదంత
  • పోషిత భర్తృక-కాళింది
  • స్వాధీనపతిక- సత్యభామ

మూలాలు[మార్చు]

  • శ్రీ రాజగోపాలవిలాసము (1951) రచయిత: చెంగల్వ కాళకవి, సంపాదకుడు: నిడుదవోలు వెంకటరావు, ప్రచురణ: గోపాలన్, సరస్వతీ మహల్ గ్రంథాలయం, తంజావూరు.


Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: