రాజగోపాలవిలాసము
(రాజగోపాల విలాసము నుండి దారిమార్పు చెందింది)
రాజగోపాలవిలాసము 17వ శతాబ్దానికి చెందిన ఒక తెలుగు పద్యరచన. దీనిని విజయరాఘవ నాయకుని ఆస్థానకవి యైన [[చెంగల్వ కాళయ]] రచించెను. రచయిత తన కృతిని తంజావూరు నాయకరాజైన విజయరాఘవ నాయకుడు అంకితమిచ్చెను.
దీనిని మొదటిసారి తంజావూరు సరస్వతీ మహల్ గ్రంథాలయం వారు 1951 ముద్రించి ప్రచురించారు. నిడుదవోలు వెంకటరావు విపులమైన పీఠికను ఆంగ్ల-తెలుగు భాషలలో అందించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు.
విషయ సంగ్రహం
[మార్చు]ఈ పద్యకావ్యం ఐదు ఆశ్వాసాలుగా రచించబడినది. వీనిలో రాజగోపాలునిగా పేర్కొన్న శ్రీకృష్ణుని అష్టమహిషులను శృంగార నాయికలుగా కీర్తించబడ్డారు.
- స్వీయ- రుక్మిణి
- జారిణి-భద్ర
- జారిణి-లక్షణ
- విప్రలబ్ద- జాంబవతి
- ఖండిత-మిత్రవింద
- విరహోత్కంఠిత-సుదంత
- పోషిత భర్తృక-కాళింది
- స్వాధీనపతిక- సత్యభామ
మూలాలు
[మార్చు]- శ్రీ రాజగోపాలవిలాసము (1951) రచయిత: చెంగల్వ కాళకవి, సంపాదకుడు: నిడుదవోలు వెంకటరావు, ప్రచురణ: గోపాలన్, సరస్వతీ మహల్ గ్రంథాలయం, తంజావూరు.