Jump to content

రాజమండ్రి కేంద్ర కారాగారం

వికీపీడియా నుండి
రాజమండ్రి సెంట్రల్ జైలు
పటం
Locationరాజమండ్రి
Capacity1648
Population1328 (as of 5 జూలై 2011)
Opened1864
Managed byడైరెక్టర్ జనరల్ & ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

రాజమండ్రి సెంట్రల్ జైలు రాజమండ్రిలో ఉన్న ఒక జైలు. రాజమండ్రిలో సందర్శించవలసిన ప్రదేశాలలో రాజమండ్రి సెంట్రల్ జైలు ఒకటి.

చరిత్ర

[మార్చు]

1602 లో డచ్ వారు రాజమండ్రిలో ఒక కోటను నిర్మించారు. బ్రిటిష్ సామ్రాజ్యం 1864 లో దీనిని ఒక జైలుగా మార్చేసింది, ఆపై ఇది 1870 లో కేంద్ర జైలుగా అత్యాకర్షింపబడింది. ఈ జైలు 196 ఎకరాలలో (79 హెక్టారులలో) విస్తరించి వుంది, దీనిలో భవనాలు 37.24 ఎకరాలను (15.07 హెక్టార్లను) ఆక్రమించాయి.

ఈ జైలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతి పురాతనమైన, అన్ని రకాల సురక్షిత వ్యవస్థలు కలిగిన జైలు. 1991 సంవత్సరం జైలు కార్యాలయం అందించిన ఆధారల ప్రకారం ఈ జైలులో 581 మంది జీవైత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఖైధీలు, 355 స్వల్ప కాలం జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైధీలు ఉన్నారు. రాజమండ్రి కొంత కాలం డచ్ వారి పరిపాలనలో ఉంది. డచ్ వారు మూడు నిల్వ గదులు ఏర్పాటు చేశారు, దీనిలో ఆయుధాలు తుపాకులు భద్రపరచుకొనే వారు. ఈ గదులపైన ఒక రంధ్రం ఉన్నది, అవసరం పడి నప్పుడు ఆ రంధ్రం గుండా కావలసిన ఆయుధాలు తీసుకొనేవారు. ఈ గదులు కొలతలు 10 అడుగులు ఎత్తు 10 అడుగుల వెడల్పు 10 అడుగుల పొడవు) ఉంటాయి. ఒక గది రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నది, రెండవది మునిసిపల్ ఆఫీస్ పశ్చిమ గేటుకి ఎదురుగా ఉంది, మూడవది పాత సబ్ కలెక్టర్ ఆఫీసు వెనుక అప్సర హోటలు దగ్గర ఉంది. ఈ గదులను ఇప్పుడు రికార్డులను దాచడానికి తగులపెట్టడానికి ఉపయోగిస్తున్నారు. 1857 సంవత్సరంలో ప్రథమ స్వాతంత్ర్య సమరం జరిగాక రాజమండ్రి డచ్ వారి చేతుల నుండి ఆంగ్లేయులకు హస్తగతం అయ్యింది, అప్పుడు ఆంగ్లేయులు ఈ కోటను కారాగారంగా మార్చారు. ఈ కారాగారంలో ఒక పెద్ద దేవాలయం ఉండేదని ( ఇప్పుడు లేదు) డి.ఐ.జి. కార్యాలయంలో ఉన్న శిలా ఫలకం చెబుతుంది. ఇంకో ఆకర్షణ ఈ జైలులో గజలక్ష్మి ( లక్ష్మి దేవి విగ్రహం లక్ష్మి దేవికి ఇరుప్రక్కల రెండు ఏనుగులు ఉన్నాయి) విగ్రహం కనిపిస్తుంది, ఇది గజపతుల రాజ చిహ్నం. గోదావరి నది నుండి ప్రవాహించే ఒక నది పాయ ఈ జైలులో ప్రవహించేది, కాని ఆ పాయ మార్గం ఇప్పుడు మారి పోయింది. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు ఎందరో ఈ జైలులో ఆంగ్లేయుల చేత ఖైదు చేయబడినారు.

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]