రాజారాం శాస్త్రి
స్వరూపం
రాజారామ్ శాస్త్రి (1904 జూన్ 4 - 1991 ఆగష్టు 21) భారతీయ విద్యావేత్త. అతను 1971 భారత సార్వత్రిక ఎన్నికలలో వారణాసి నుండి భారత పార్లమెంటు దిగువ సభ అయిన 5 వ లోక్సభ సభ్యుడిగా (ఎంపి) ఎన్నికయ్యాడు. 1964 - 1971 వరకు కాశీ విద్యాపీఠానికి ప్రొఫెసర్ గా, ఉపకులపతిగా పనిచేశాడు. ఇతడు రాయ్ బహదూర్ ఠాకూర్ జైస్వాల్ మనవడు.
అతను మొదటి జాతీయ కార్మిక కమిషన్ సభ్యుడిగా పనిచేశాడు. 1991 లో భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అందుకున్నాడు.[1][2]
ఆయన 1991 ఆగస్టు 21 న 87 సంవత్సరాల వయసులో న్యూఢిల్లీలో మరణించాడు.[3]
బాల్యం
[మార్చు]శాస్త్రి 1904 జూన్ 4 న ఉత్తరప్రదేశ్, మీర్జాపూర్ జిల్లాలోని జమాల్పూర్ గ్రామంలో జన్మించాడు. ఆయన కాశీ విద్యాపీఠ్, చికాగో విశ్వవిద్యాలయంలో తన విద్యను పూర్తి చేశాడు. 1927 లో సౌదామిని దేవిని వివాహం చేసుకున్నాడు.[4]
అనుబంధాలు
[మార్చు]- 1947లో ఏఐసిసి సభ్యుడు[5]
- 1948-59లో సోషలిస్ట్ పార్టీ సభ్యుడు (ఇప్పుడు పి.ఎస్.పి), 1958లో దాని కార్యనిర్వాహక సభ్యుడు కూడా
- 1958లో జాతీయ కార్మిక కమిషన్ సభ్యుడు
- అధ్యక్ష, పురస్కార్ యోజన సమితి, యూపి ప్రభుత్వం (హిందీ, ఉర్దూ, సంస్కృత పుస్తకాలపై బహుమతి పంపిణీ కమిటీ)
- యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సామాజిక పని, విద్య, శిక్షణ కమిటీ సభ్యుడు
- భారత సామాజిక సంక్షేమ మండలి ఉపాధ్యక్షుడు[6]
- కేంద్ర సామాజిక సంక్షేమ బోర్డు సభ్యుడు
- యూపి. హిందీ గ్రంథ్ అకాడమీ సభ్యుడు
- 1958లో యోజన ముల్యాంకన్ సమితి సభ్యుడు (ప్రణాళిక మూల్యాంకన కమిటీ)
రచనలు
[మార్చు]- మన్ కే భేడ్ (హిందీ)[7]
- వైయక్తిక్ మనోవిజ్ఞాన్ (హిందీ)
- సమాజ్ విజ్ఞాన్ (హిందీ)
- సోషల్ వర్క్ ట్రెడిషన్స్ ఇన్ ఇండియా (ఆంగ్లం)
- స్వప్న దర్శన్ (హిందీ)
మూలాలు
[మార్చు]- ↑ "IASIndia.org". www.iasindia.org.
- ↑ "Padma Vibhushan Awardees". Ministry of Communications and Information Technology (India)|Ministry of Communications and Information Technology. Retrieved 2009-06-28.
- ↑ "Obituary".
- ↑ Centre, National Informatics. "Digital Sansad". Digital Sansad (in ఇంగ్లీష్). Retrieved 2025-04-23.
- ↑ "Jaiswals' 1936 vintage car set to hit road again". Hindustan Times (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-05-08. Archived from the original on 13 December 2024. Retrieved 2025-02-19.
- ↑ "IASIndia.org". iasindia.org. Archived from the original on 21 January 2021. Retrieved 22 June 2012.
- ↑ "First Ranchi Mayor, veteran Cong leader passes away". The Pioneer (in ఇంగ్లీష్). Archived from the original on 2025-02-17. Retrieved 2025-02-19.