రాజా టి.రామారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాజా తుమ్మలపల్లి రామారావు, మద్రాసు ప్రెసిడెన్సీలో రాజకీయ నాయకుడు, విద్యావేత్త, న్యాయవాది.[1]

రాజా టి.రామారావు ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చి మద్రాసులో స్థిరపడిన గోల్కొండ వ్యాపారులు కుటుంబానికి చెందినవాడు. ఈయన 1864లో బి.ఏ డిగ్రీతో పట్టభద్రుడై, 1866 న్యాయశాస్త్రంలో పట్టా పొంది, 1867లో మద్రాసు హైకోర్టులో వకీలుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. అనతికాలంలోనే న్యాయవాద ప్రాక్టీసును అభివృద్ధి చేసి, మంచి న్యాయవాదిగా పేరుతెచ్చుకున్నాడు. ఆ తర్వాత బార్ యొక్క నాయకుడయ్యాడు. 1880 వ దశకంలో న్యాయస్థానంలో ఈయన తన సమకాలీనులైన ప్రసిద్ధ న్యాయవాదులు, సర్ వి.భాష్యం అయ్యంగార్, సర్ ఎస్.సుబ్రమణ్య అయ్యర్‌లతో తలపడ్డాడు.[2]

టి.రామారావు, 1880లో మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు కూడా నియమించబడి, 1886 వరకు ఆరు సంవత్సరాల పాటు కౌన్సిల్‌ సభ్యుడిగా పనిచేశాడు. ఈయన కార్యకలాపాలు, సలహాలు, ప్రభుత్వం యొక్క గౌరవాన్ని, ప్రత్యేకంగా అప్పటి మద్రాసు గవర్నరు గ్రాంట్ డఫ్ఫ్ గౌరవాన్ని అందుకున్నాయి. లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో ఈయన చేసిన సేవలను, న్యాయవాద వృత్తిలో ఈయన ప్రాముఖ్యతను గుర్తిస్తూ, ప్రభుత్వము ఈయనకు "రాజా" అనే బిరుదునిచ్చి సత్కరించింది. ఈయనకు మద్రాసు నగరంలోని అనేక ప్రజా సంస్థలు, ఉద్యమాలతో అనుబంధం ఉన్నది.[2]

విద్యావేత్తగా మద్రాసు హిందూ ఉన్నత పాఠశాలకు పోషకుడిగా, 1899 నుండి 1904 వరకు పాఠశాల యాజమాన్య సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆ కాలంలో ఎం.ఏ.సింగరాచియర్, ఎం.ఓ.పార్థసారధి అయ్యంగార్, ఎం.వీరరాఘవాచారియర్, ఎం.ఏ.తిరునారాయణాచారియర్ వంటి పురప్రముఖులు ఈ పాఠశాల యాజమాన్య సంఘంలో ఉండేవారు. ఈయన ఆధ్వర్యంలో ప్రధాన పాఠశాల భవనపు ఉత్తర విభాగాన్ని విస్తరించారు.[2]

మూలాలు

[మార్చు]
  1. "మన కోర్టులు" (PDF). జమీన్‌రైతు. 1954-07-09. p. 1. Retrieved 2024-10-21.
  2. 2.0 2.1 2.2 "Raja T. Rama Rao, 1889-1904". hinduhighschool.net. Retrieved 21 October 2024.