రాజీవ్ యువశక్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే పథకం .వివిధ కోర్సుల్లో నైపుణ్యం పెంపొందించే (స్కిల్‌ డెవలెప్‌మెంట్‌) కార్యక్రమం ఇందులో భాగం. వ్యక్తిగత రుణాలు , చిరు వ్యాపారాలు, గ్రూపు రుణాలు ఇచ్చేందుకు ప్రణాళికలున్నాయి.20%సబ్సిడీగా చెల్లిస్తారు.70% బ్యాంకు రుణం 10% లబ్ధిదారుని వాటా. గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.యూనిట్ల మంజూరుకు బ్యాంకులు కూడా అంగీకరించాలి.వివిధ కోర్సుల్లో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధిని కల్పించేందుకు నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ ఇస్తారు. హోటల్‌ మేనేజ్‌మెంట్‌, కాల్‌సెంటర్‌ ట్రైనింగ్‌, డీటీపీ, సెక్యూరిటీ గార్డు, కారు డ్రైవింగ్‌, కంప్యూటర్‌ ట్రైనింగ్‌ తదితర కోర్సులు ఉన్నాయి.