రాజీ నా ప్రాణం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజీ నా ప్రాణం
(1954 తెలుగు సినిమా)
Raji Naa Pranam 1954film.jpg
చందమామ పత్రికలో రాజీ నా ప్రాణం ప్రకటన
దర్శకత్వం కె.జె. మహదేవన్
తారాగణం శ్రీరంజని జూ.,
టి.ఆర్.రామచంద్రన్
సంగీతం ఎస్.హనుమంతరావు
నేపథ్య గానం ఆర్.బాలసరస్వతి దేవి
గీతరచన దేవులపల్లి కృష్ణశాస్త్రి
నిర్మాణ సంస్థ జెమిని స్టూడియో
భాష తెలుగు

పాటలు[మార్చు]

కథ[మార్చు]

రాము (టి.ఆర్.రామచంద్రన్) అనే నిరుద్యోగి పనీపాటా లేకుండా తిరగడం చూచి సంఘం అతన్ని హీనంగా చూస్తూ ఉంటుంది. అతడొకసారి రాజీ(శ్రీరంజని) అనే గుడ్డిపిల్లను ప్రాణాపాయం నుండి రక్షిస్తాడు. ఆమె తన ప్రాణదాతను చూడలేకపోయినా, అతణ్ణి ప్రేమిస్తుంది. అతడు కూడా ఆమెను ప్రేమిస్తాడు. ఒక డాక్టరు సహాయం వల్ల ఆమెకు తిరిగి దృష్టి కలుగజేస్తాడు. కానీ ఆమె అతణ్ణి చూసే అవకాశం లేకుండానే, అతణ్ణి పోలీసులు దొంగతనం నేరం మీద జైలుకు లాక్కుపోతారు. రాజీకి దృష్టి యిచ్చిన డాక్టర్ రఘు(శ్రీరామ్) ఆమెను ప్రేమించి పెళ్లాడగోరతాడు. ఆమె యిష్టం లేకపోయినా పెళ్లికి ఒప్పుకోవలసి వస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత రాము జైలు నుండి విడుదలై రాజీ వద్దకు వస్తాడు. డాక్టర్ రఘు రామును అనుమానిస్తాడు. డాక్టర్ అనుమానాన్ని తొలగించేందుకు, రాజీ సంతోషంగా జీవిస్తుందనే తృప్తితో రాము రాజీకి తను ఎవరో తెలియ జేయకుండానే అక్కడి నుండి వెళ్లిపోతాడు[1].

మూలాలు[మార్చు]