టీ న్యూస్

వికీపీడియా నుండి
(రాజ్ న్యూస్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
టి.న్యూస్
దేశంభారతదేశం
కేంద్రకార్యాలయంహైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
ప్రసారాంశాలు
భాష(లు)తెలుగు
చరిత్ర
ప్రారంభంఏప్రిల్ 2011
లభ్యత

టి.న్యూస్ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రానికి చెందిన టెలివిజన్ వార్తా ఛానల్. ఈ ఛానల్ తెలంగాణ రాష్ట్ర సమితికి చెందినది. ఈ ఛానల్ ద్వారా వార్తలు, సంఘటనలు, తెలంగాణ సంస్కృతికి సంబంధించిన విషయాలు ప్రసారమవుతాయి. ఈ ఛానల్ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, చరిత్రను ప్రతిబింబిస్తుంది. ఈ ఛానల్ నినాదం " తెలంగాణ గుండె చప్పుడు". ఈ ఛానల్ లో ఉర్దూ వార్తా బులెటిన్ లు కూడా ప్రసారమవుతాయి. ఇది తెలంగాణ లోని హైదరాబాద్ ఆధారంగా పనిచేస్తుంది. అప్పుడప్పుడూ ఉర్దూ వార్తలను కూడా ప్రసారం చేస్తుంది. ఇందులో బ్రేకింగ్ న్యూస్, లైవ్ రిపోర్టులు, ఇంటర్వ్యూలు, రాజకీయ చర్చలు, క్రీడలు, వాతావరణం, వినోద కార్యక్రమాలు, వ్యాపార విషయాలు, కరంట్ అఫైర్స్ లు ప్రసారితమవుతాయి.

టి.న్యూస్ కార్యక్రమాలు

[మార్చు]
  • ఆదాబ్ తెలంగాణ
  • భక్తి మార్గాలు
  • బాలీవుడ్ టాకీస్
  • చేను చెలక
  • ఫిల్మి దునియా
  • గుడ్ ఆఫ్టర్ నూన్
  • గుడ్ ఈవినింగ్
  • గుడ్ మార్నింగ్
  • హెల్త్ ప్లస్
  • జర్నీ
  • మాయాజజార్
  • నమస్తే తెలంగాణా
  • న్యూస్ టు నైట్
  • ఓపెన్
  • సింగరేణి స్రవంతి
  • సింగిడి
  • స్టడీ గైడ్
  • తెలంగాణ 360
  • ట్రెండ్జ్
  • పవర్ ఆఫ్ న్యూమరాలజీ
  • వార్తలు లైవ్
  • వైద్యం ఆరోగ్యం లైవ్
  • విశ్వరూపం
  • వీకెండ్ ధూం ధాం
  • వీకెండ్ సింగిడి

లభ్యత

[మార్చు]

ఈ చానల్ ను తెలంగాణ టెలివిజన్ నెట్ వర్క్స్ అయిన టాటా స్కై, వీడియాకాన్ డి.టి.హెచ్, రిలయన్స్ డిజిటల్ టి.వి. ఎయిర్ టెల్ డిజిటల్ టి.వి. డిష్ టి.వి, సన్ డైరక్ట్ లు ప్రసారం చేస్తున్నాయి. ఈ ఛానల్ ప్రత్యక్ష ప్రసారాలను దాని అంతర్జాల వెబ్‌సైట్, యూట్యూబ్ లలో కూడా ప్రసారం చేస్తుంది.

చరిత్ర

[మార్చు]

ఈ ఛానల్ రాజ్ న్యూస్ తో కలసి మొదట పనిచేసింది. 2011 ఏప్రిల్ 4 న ఉగాది రోజున టి.న్యూస్ ఛానల్ గా స్వతంత్ర ఛానల్ గా ప్రారంభించబడినది. [1]

మూలాలు

[మార్చు]
  1. "TRS looks for writers, poets from T". The Times of India. 2011-04-05. Archived from the original on 2012-11-05.

బాహ్య లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=టీ_న్యూస్&oldid=4300761" నుండి వెలికితీశారు