Jump to content

రాధా మనోహరం

వికీపీడియా నుండి

రాధా మనోహరం
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
Q. indica
Binomial name
Quisqualis indica

రాధా మనోహరం లేదా రంగూన్ మల్లి (క్విస్క్వాలిస్ ఇండికాను) చైనీస్ హనీసకేల్, రంగూన్ క్రీపర్,, కాంబ్రెటమ్ ఇండికం అని పిలుస్తారు. ఇది ప్రపంచంలోని అనేక ఇతర ప్రాంతాలలో పండించిన అలంకారంగా లేదా అడవిగా నడుస్తుంది.

చరిత్ర

[మార్చు]

రాధా మనోహరం మొక్కకు ఇతర పేర్లు స్పానిష్ భాషలోక్విస్కువల్, ఫిలిపినోలో, నియోగ్-నియోగన్ , తెలుగులో రాధా మనోహరం , అస్సామీ లో బర్మా లత , హిందీ లో మధు మాలతి, మాధవి లత , మణిపురి లో పారిజత్, మరాఠీ లో విలాటి చాంబేలి , తమిళంలో ఇరంగున్ మల్లి , బెంగాలీ లో మధుమాన్జారీ అని అంటారు.[1] దీని పుట్టుక ఆఫ్రికా , బెనిన్, ఐవరీ కోస్ట్, ఘనా, మాలి, నైజీరియా, సియెర్రా లియోన్, టోగో, టాంజానియా, జైర్, అంగోలా, భారతదేశం, నేపాల్ ,శ్రీలంక, చైనా, తైవాన్ , కంబోడియా, లావోస్, మయన్మార్, థాయిలాండ్, వియత్నాం, మలేషియా, పాపువా న్యూ గినియా ,ఫిలిప్పీన్స్ , ఉత్తర పశ్చిమ ఆస్ట్రేలియాలోని తీర ప్రాంతములలో కనబడుతుంది [2]

పెరుగుదల

[మార్చు]

రాధా మనోహరం ఆకుపచ్చ రంగులో ఉండి , పువ్వులు ప్రారంభంలో తెల్లగా, గులాబీ రంగు మారి , పరిపక్వతకు చేరుకున్నప్పుడు చివరికి ఎరుపు అవుతుంది.వేసవి కాలంలో పువ్వులు రావడం , 4 నుండి 5 అంగుళాల (10-12 సెం.మీ.) పువ్వులు వికసించిన సమయంలో దీని సువాసన రాత్రి సమయంలో ఎక్కువగా ఉంటుంది. పండ్లు అరుదుగా కాస్తాయి, ఇవి మొదట ఎరుపు రంగులో, ఎండబెట్టిన తర్వాత గోధుమ రంగులో ఉంటాయి. రాధా మనోహరం పూర్తి ఎండ, తగినంత నీడ అవసరం. రకరకాల నేలలో పెరుగుతాయి. . నత్రజని ఎక్కువగా ఉండే ఎరువులను వీటి పెంపకమునకు వాడవద్దు ఇవి ఆకుల పెరుగుదలకే ఇవి తోడ్పడుతాయి పువ్వలకు కాదు [3]

ఉపయోగములు

[మార్చు]

రాధా మనోహరం పువ్వు సువాసనతో పాటు, వివిధ వైద్య రంగాలలో ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించబడింది. ఈ మొక్కలో ఎన్నో విలువలు ఉన్నాయి అనేక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి వాడతారు . దీనిలో ఉన్న ప్రతి భాగం కొన్ని ప్రయోజనాలను చేకూరుస్తుంది . రాధా మనోహరం చర్మ సమస్యలకు, ఆకులు రసం రూపంలో దిమ్మలు , పూతల వంటి చర్మ సమస్యలకుదిమ్మలు,తలనొప్పికి నుదిటిపై సమర్థవంతంగా పనిచేస్తుంది.మూత్రవిసర్జన వంటి వ్యాధులకు ఆకులు మరిగించి కషాయం ద్వారా వాడతారు. దీని విత్తనమ్ముల పొడితో కడుపులో జీర్ణ సంభందిత వ్యాధులలో వాడతారు . పండ్లను విరేచనాలు ,జ్వరాలకు, మూత్రపిండాల వాపును ( నెఫ్రిటిస్ చికిత్స) కు , దీని మొక్క క్యాన్సర్ చికిత్స కణితి వంటివి తగ్గడానికి మూడు పదార్థాలు ఇందులో ఉన్నాయి [4]


మూలాలు

[మార్చు]
  1. "Combretum indicum - Rangoon Creeper". www.flowersofindia.net. Retrieved 2020-10-08.
  2. "Quisqualis indica". keyserver.lucidcentral.org. Retrieved 2020-10-08.
  3. "StackPath". www.gardeningknowhow.com. Retrieved 2020-10-12.
  4. "Madhumalti (Rangoon Creeper) Flowering Plant– How to Grow, Care and Benefits". Greenkosh (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-09-07. Retrieved 2020-10-12.

బయటి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.