రాధిక తిలక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాధిక తిలక్
జననం1969 (1969)
మరణం2015 సెప్టెంబరు 20(2015-09-20) (వయసు 45–46)
కొచ్చి ఎర్నాకుళం జిల్లా, కేరళ, భారతదేశం
జాతీయతభారతీయురాలు
వృత్తిగాయని
భార్య / భర్తసురేష్ కృష్ణ
పిల్లలు1
బంధువులునారాయణ పిళ్లై (తాత)|వేణుగోపాల్ (బావ)|సుజాత మోహన్ (మరదలు)}}

రాధికా తిలక్ (1969 - 20 సెప్టెంబర్ 2015) మలయాళ చిత్ర పరిశ్రమలో పనిచేసిన భారతీయ నేపథ్య గాయని . [1] మలయాళ సినిమాలలో రాధిక తిలక్ 70 పాటలు పాడారు. [2] [3] [4] [5] [6] [7] [8]

కెరీర్[మార్చు]

రాధిక తిలక్ పాడిన కొన్ని పాటలు ప్రజాదరణ పొందాయి. రాధిక తిలక్ పాడిన "అరుణకిరణ దీపం", "దేవ సంగీతం", "మాయ మంచిలిల్", "కైతపూ మనం", "తిరువాతిర తీర నోక్కియా", "ఎంతే ఉల్లుదుక్కుం కొట్టి" "నింటే కన్నిల్"లాంటి పాటల ఆమెకు పేరు తెచ్చిపెట్టాయి. [9] రాధిక తిలక్ తమిళ సినిమా ఆరాధనై (1981)లో పాడిన పాట"ఇలంపని తులి" పాట బాగా గుర్తుండిపోయింది. రాధిక తిలక్ సినిమా పాటలే కాకుండా 200 భక్తి గీతాలు కూడా పాడింది. [10] రాధిక తిలక్ టీవీ యాంకర్ కూడా. [11] [12]

అవార్డులు[మార్చు]

2002లో కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కుంజికూనన్ చిత్రంలోని ఓమనమలరే నిన్మరన్ పాటకు గాను రాధిక తిలక్ కు ఉత్తమ నేపథ్య గాయని అవార్డును అందజేసింది.[ వివరణ అవసరం ]

మరణం[మార్చు]

2015 సెప్టెంబర్ 20న, రాధిక తిలక్ ను ఆరోగ్యం విషమించడంతో సాయంత్రం కొచ్చిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు సుమారు రాత్రి 8 గంటల సమయంలో రాధిక తిలక్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మరణించే నాటికి రాధిక తిలక్ వయసు 45. రాధిక తిలక్ దాదాపు రెండు సంవత్సరాలుగా క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతోంది. [13]

మూలాలు[మార్చు]

 1. "Radhika Thilak Bio | Radhika Thilak Career". MTV. Retrieved 23 September 2015.
 2. Jayaram, Deepika. "Playback singer Radhika Thilak passes away". The Times of India. Retrieved 10 October 2018.
 3. "Malayalam playback singer Radhika Thilak dies at 45". The Indian Express. Retrieved 23 September 2015.
 4. "Singer Radhika Thilak is dead". The Hindu. 30 August 2015. Retrieved 23 September 2015.
 5. Correspondent, Our. "Radhika Thilak and her voice become a memory". English.manoramaonline.com. Retrieved 2015-09-24.
 6. Sachin Jose. "Radhika Thilak: Popular Hindu, Christian devotional songs by late playback singer". Ibtimes.co.in. Retrieved 2015-09-24.
 7. Sachin Jose (2015-09-20). "Radhika Thilak dies at 45; Mohanlal, Oommen Chandy mourn Malayalam playback singer's untimely death". Ibtimes.co.in. Retrieved 2015-09-24.
 8. "Singer Radhika Thilak dies after losing the battle to cancer : Regional cinema, News - India Today". Indiatoday.intoday.in. 2015-09-20. Retrieved 2015-09-24.
 9. "List of Malayalam Songs by Singers Radhika Thilak". En.msidb.org. 26 January 2009. Retrieved 23 September 2015.
 10. "List of Songs Sung by Radhika Thilak". Firstshowreview. Retrieved 23 September 2015.
 11. Correspondent, Our. "Playback singer Radhika Thilak passes away". English.manoramaonline.com. Retrieved 23 September 2015.
 12. Sachin Jose. "Radhika Thilak death: 10 songs to remember deceased playback singer". Ibtimes.co.in. Retrieved 23 September 2015.
 13. "Singer Radhika Thilak Death". TNPlive. hyderabad. 21 September 2015.