Jump to content

రాబర్ట్ ఎడ్వర్డ్స్

వికీపీడియా నుండి


సర్ రాబర్ట్ ఎడ్వర్డ్స్
జననంరాబర్ట్ జాఫ్రీ ఎడ్వర్డ్స్
(1925-09-27)1925 సెప్టెంబరు 27 [1]
బాట్లీ, ఇంగ్లాండ్
మరణం2013 ఏప్రిల్ 10(2013-04-10) (వయసు 87)
ఇంగ్లండ్
పౌరసత్వంబ్రిటీష్
జాతీయతఇంగ్లీష్
రంగములుఫిజియాలజీ, పునరుత్పత్తి
వృత్తిసంస్థలుకేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం
ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం
బాంగోర్ విశ్వవిద్యాలయం
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ రీసెర్చ్
గ్లాస్గో విశ్వవిద్యాలయం
కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
చర్చిల్ కాలేజ్, కేంబ్రిడ్జ్
చదువుకున్న సంస్థలుబంగోర్ విశ్వవిద్యాలయం
ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయం
ప్రసిద్ధిఇన్-విట్రో ఫెర్టిలైజేషన్
ముఖ్యమైన పురస్కారాలుఫిజియాలజీ, మెడిసిన్‌లో నోబెల్ బహుమతి (2010)

రాబర్ట్‌ ఎడ్వర్డ్స్‌ (ఆంగ్లం: Robert Geoffrey Edwards) (27 సెప్టెంబర్ 1925 - 10 ఏప్రిల్ 2013) బ్రిటన్‌ శాస్త్రవేత్త. ఈ అపరబ్రహ్మకు వైద్యంలో నోబెల్‌ పురస్కారం దక్కింది. ఇతని కృషితో సంతానం లేని దంపతుల జీవితంలో ఆనందం కలిగించారు.[2][3][4]

సంతానం లేని లక్షలాది దంపతుల పాలిట కల్పతరువైన టెస్ట్‌ట్యూబ్‌ బేబీ (ఇన్‌-విట్రో ఫర్టిలైజేషన్‌) విధాన సృష్టికర్త రాబర్ట్‌ ఎడ్వర్డ్స్‌. 2010 సంవత్సరానికి గాను వైద్యశాస్త్రంలో నోబెల్‌ బహుమతిని గెల్చుకున్నారు. ఈ బహుమతి కింద ఆయన 15 లక్షల డాలర్లు అందుకున్నారు. ఎడ్వర్డ్స్‌ బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌ ఎమిరిటస్‌గా విధులు నిర్వర్తించారు.

1950 నుంచి ఎడ్వర్డ్స్‌ ఐవీఎఫ్‌ విధానంపై గైనకాలజిస్టు ప్యాట్రిక్‌ స్టెప్‌టో తో కలసి ప్రయోగాలు నిర్వహించారు.[5] ఈ విధానంలో ఆయన అండాన్ని శుక్రకణంతో శరీరం వెలుపలే ఫలదీకరణ చేయించి, మహిళ గర్భంలోకి ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో వారు అనేక విమర్శలు, సవాళ్లు ఎదుర్కొన్నారు. ఇది అనైతిక విధానమంటూ మతపెద్దలు మండిపడ్డారు. వీటన్నింటినీ ఎడ్వర్డ్స్‌, ప్యాట్రిక్‌లు అధిగమించారు. వీరిద్దరి పరిశోధనలు ఫలించి 1978, జూలై 25న ప్రపంచంలోనే తొలిసారిగా బ్రిటన్‌లో లూయీ బ్రౌన్‌ అనే టెస్ట్‌ట్యూబ్‌ బేబీ జన్మించింది.[6][7][8] సంతాన సాఫల్య చికిత్స విధానంలో ఇది విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. ఆ తరువాత వీరిద్దరు కలసి కేంబ్రిడ్జ్‌లోని బోర్న్‌హాల్‌ ఐవీఎఫ్‌ క్లినిక్‌ స్థాపించారు. అప్పటి నుంచి వేల మంది జంటలు సంతానాన్ని పొందారు. ఎడ్వర్డ్స్‌కు నోబెల్‌ బహుమతి ప్రకటించడంపై బార్న్‌ హాల్‌ క్లినిక్‌ హర్షం వ్యక్తంచేసింది. వాస్తవానికి నోబెల్‌ బహుమతిని ప్యాట్రిక్‌ కూడా పంచుకోవాల్సింది. అయితే ఆయన 1988లో చనిపోయారు.

ఎడ్వర్డ్స్‌ సాధించిన ఘనత వల్ల సంతానలేమికి కొత్త చికిత్స అందుబాటులోకి వచ్చినట్లయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంటల్లో 10 శాతం మందికి ఈ సమస్య ఉంది. ఐవీఎఫ్‌ విధానం వల్ల దాదాపు 40 లక్షల మంది శిశువులు పుట్టారు. ఈ విధానం ఫలదీకరణ సమస్యలున్న దంపతుల్లో హర్షాతిరేకాలను నింపుతోంది అని నోబెల్‌ పురస్కారాన్ని ప్రకటించిన కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌ ఎంపిక కమిటీ స్టాక్‌హోంలో పేర్కొంది.

నోబెల్‌ బహుమతి లభించిన సమయంలో ఎడ్వర్డ్స్‌ తీవ్ర అస్వస్థతతో ఉన్నారు. ఈ విషయం అతని సతీమణికి తెలిపినట్లు ఎంపిక కమిటీ సభ్యుడు గోరాన్‌ హాన్సన్‌ చెప్పారు. ఎడ్వర్డ్స్‌కు నోబెల్‌ దక్కడంపై అంతర్జాతీయ ఫలదీకరణ సంస్థల సమాఖ్య మాజీ అధ్యక్షుడు బాసిల్‌ టార్లాట్జిస్‌ హర్షం వ్యక్తంచేశారు. డైనమైట్‌ను కనుగొన్న వ్యాపారవేత్త ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీద ఈ బహుమతిని ఏర్పాటు చేశారు.[9][10][11][12]

మూలాలు

[మార్చు]
  1. "EDWARDS, Sir Robert (Geoffrey)". Who's Who 2013, A & C Black, an imprint of Bloomsbury Publishing plc, 2013; online edn, Oxford University Press.(subscription required)
  2. Gardner, Richard (2015). "Sir Robert Geoffrey Edwards CBE. 27 September 1925 – 10 April 2013". Biographical Memoirs of Fellows of the Royal Society. 61. Royal Society: 81–102. doi:10.1098/rsbm.2014.0020. ISSN 0080-4606.
  3. Johnson, M. H. (2011). "Robert Edwards: The path to IVF". Reproductive BioMedicine Online. 23 (2): 245–262. doi:10.1016/j.rbmo.2011.04.010. PMC 3171154. PMID 21680248.
  4. Fisher, S. J.; Giudice, L. C. (2013). "Robert G. Edwards (1925–2013)". Science. 340 (6134): 825. Bibcode:2013Sci...340..825F. doi:10.1126/science.1239644. PMID 23687039. S2CID 34150798.
  5. Edwards, R. G. (1996). "Patrick Christopher Steptoe, C. B. E. 9 June 1913 – 22 March 1988". Biographical Memoirs of Fellows of the Royal Society. 42: 435–52. doi:10.1098/rsbm.1996.0027. PMID 11619339.
  6. Steptoe, P. C.; Edwards, R. G. (1978). "Birth After the Reimplantation of a Human Embryo". The Lancet. 312 (8085): 366. doi:10.1016/S0140-6736(78)92957-4. PMID 79723. S2CID 31119969.
  7. "1978: First 'test tube baby' born". BBC. 25 July 1978. Retrieved 13 June 2009. The birth of the world's first "test tube baby" has been announced in Manchester (England). Louise Brown was born shortly before midnight in Oldham and District General Hospital
  8. Moreton, Cole (14 January 2007). "World's first test-tube baby Louise Brown has a child of her own". Independent. London. Retrieved 22 May 2010. The 28-year-old, whose pioneering conception by in-vitro fertilisation made her famous around the world ... The fertility specialists Patrick Steptoe and Bob Edwards became the first to successfully carry out IVF by extracting an egg, impregnating it with sperm and planting the resulting embryo back into the mother.
  9. Fraser L. R. (2000). "In Appreciation of Professor R. G. Edwards, Founding Editor of the Human Reproduction Journals". MHR: Basic Science of Reproductive Medicine. 6 (5): 3. doi:10.1093/molehr/6.5.3. PMID 10775640.
  10. "The 2010 Nobel Prize in Physiology or Medicine – Press Release". Nobelprize.org. 4 October 2010. Retrieved 4 October 2010.
  11. Jones Jr, H. W.; Gosden, R. G. (2013). "Professor Sir Robert Edwards, 1925–2013". Fertility and Sterility. 99 (7): 1799–800. doi:10.1016/j.fertnstert.2013.04.042. PMID 23726252.
  12. Johnson, M. H.; Franklin, S. B.; Cottingham, M.; Hopwood, N. (2010). "Why the Medical Research Council refused Robert Edwards and Patrick Steptoe support for research on human conception in 1971". Human Reproduction. 25 (9): 2157–74. doi:10.1093/humrep/deq155. PMC 2922998. PMID 20657027.