రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు

వికీపీడియా నుండి
(రామకృష్ణ రంగారావు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Raja Sri Ravu Svetachalapati Ramakrishna Ranga Rao
రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు


Member of the Legislative Assembly of Andhra Pradesh for Bobbili
పదవీ కాలం
1967 – 1972
Premier Kasu Brahmananda Reddy
ముందు L. Thentu
తరువాత Venkata Krishna Rao

పదవీ కాలం
1946 – 1951

Chief Minister of Madras Presidency
పదవీ కాలం
August 24, 1936 – April 1, 1937
గవర్నరు Kurma Venkata Reddy Naidu (acting), John Erskine, Lord Erskine (2nd term)
ముందు P. T. Rajan
తరువాత Kurma Venkata Reddy Naidu
పదవీ కాలం
November 5, 1932 – April 4, 1936
గవర్నరు John Erskine, Lord Erskine
ముందు B. Munuswamy Naidu
తరువాత P. T. Rajan

Member of the Council of State (Imperial Legislative Council of India)
పదవీ కాలం
1925 – 1927

Raja of Bobbili
పదవీ కాలం
1921 – 1978
(titular from 1948)
ముందు Venkata Kumara Krishna
తరువాత Venkata Gopala Krishna Ranga Rao

వ్యక్తిగత వివరాలు

జననం (1901-02-20)1901 ఫిబ్రవరి 20
Bobbili, Madras Presidency, British Raj
మరణం 1978 మార్చి 10(1978-03-10) (వయసు 77)
Bobbili, Andhra Pradesh, India
జాతీయత Indian
రాజకీయ పార్టీ Justice Party
జీవిత భాగస్వామి Lakshmi Subadrayamma
వృత్తి politician
వృత్తి lawyer
మతం Hindu

రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు (ఫిబ్రవరి 20, 1901 - 1978) బొబ్బిలి రాజవంశానికి చెందిన 13వ రాజు.[1] ఈయన మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా జస్టిస్ పార్టీ వ్యక్తిగా 1932 నుండి 1936 వరకు మళ్ళీ 1936 నుండి 1937 వరకు నిర్వహించారు.[2].

తన చిన్నతనం నుంచే చేసిన పనిమీద పట్టుదల సాధించడం అలవాటు. లక్ష్మీ విలాస్ పాలస్ లో ముగ్గురు దొరలు ఒక భారతీయ గురువుల వద్ద విద్యాభ్యాసం చేశారు. బాడ్మింటన్, బిలియర్డ్స్ ఎక్కువగా ఆడేవారు.

1921 సంవత్సరంలో తల్లప్రోలు జమిందారీ యువరాణి లక్ష్మీ సుభద్రమ్మను వివాహం చేసుకున్నారు. 1930లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైజాగపటం నియోజకవర్గం నుండి 28,00 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. లండన్లో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ భారతదేశం తరుపున పాల్గొన్నారు. ముత్తుస్వామి నాయుడు రాజీనామా తరువాత జస్టిస్ పార్టీ రామకృష్ణ రంగారావును పార్టీ అధికారిగా ఎన్నుకున్నారు. గవర్నరు పిలుపుమీద ముఖ్యమంత్రిగా 1932 నవంబరు 5లో అధికారం చేపట్టారు.

వీరి హయాంలో ఎస్టేట్ల భూమి చట్టం, 1908 సవరించారు. దీనిద్వారా రైతులకు ఎంతో మేలు కలిగింది. ఆ కాలంలో మద్రాసు ప్రెసిడెన్సీలో మూడవ వంతు జమిందారుల హస్తాల్లో ఉండేది. ఇనాం బిల్లు ప్రవేశపెట్టి 5 మిలియన్ల రైతులకు న్యాయం చేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానము అభివృద్ధి కోసం ప్రత్యేకమైన బిల్లు ప్రవేశపెట్టారు. మద్రాసు ప్రెసిడెన్సీలో హరిజనులను దేవాలయ నిర్వాహణలో పాల్గొనేవిధంగా చట్టసవరణ చేశారు.

వీరు మంచి క్రీడాభిమాని. వీరు గుర్రపు స్వారీ, పోలో ఆటలలో ఎక్కువగా పాల్గొనేవారు. మేలు జాతి గుర్రాలను ఇంగ్లండు, ఫ్రాన్స్, పాకిస్థాన్ లనుండి దిగుమతి చేసుకొనేవారు. జైపూరు, మైసూరు లలో జరిగే దసరా ఉత్సవాలలో పాల్గొన్నారు.

వీరు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం, రవీంద్రనాథ్ టాగోర్ శాంతి నికేతనం కోసం బహుళ విరాళాలు అందజేశారు.

మూలాలు

[మార్చు]
  1. "ది హిందూ:ప్రజల రాజు". Archived from the original on 2009-01-08. Retrieved 2008-04-23.
  2. తమిళనాడు ముఖ్యమంత్రుల జాబితా

3. Bobbili: Being a biography of Sri Varu Sir Ramakrishna Swatchelapathi Ranga Rao, the 13th Raja of Bobbili, who was Chief Minister of Madras (1932-36), Nilkan Perumal, The Topical Book Co: 1960.