రామన్ మెగసెసే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రూజ్వెల్ట్ తో రామన్ మెగసెసే

రామన్ మెగసెసే రిపబ్లిక్‌ ఆఫ్‌ ఫిలిప్పీన్స్‌కు మూడవ అధ్యక్షడు. రామన్‌ డెల్‌ ఫియరో మెగసెసె సామాజిక సేవలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాడు. రెండవ ప్రపంచయుద్ధ సమయంలో జపాన్‌కు వ్యతిరేకంగా పోరాడాడు. జపాన్‌ దాస్యశృంఖలాలనుండి ఫిలీప్పీన్స్‌కు విముక్తి కలిగించడంకోసం కృషి చేశాడు. అధ్యక్షుడిగా ఫిలిప్పీన్స్‌ను అభివృద్ధి దిశగా నడిపించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన పేరుమీద అవార్డును ప్రవేశపెట్టారు. ఆసియా నోబెల్‌గా ప్రసిద్ధిగాంచిన ఆ పురస్కారం ప్రతిసంవత్సరం వివిధ రంగాల్లో కృషిచేసిన ఆసియా ప్రముఖులకు అందజేస్తారు. 1953లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయఢంకా మోగించి రిపబ్లిక్‌ ఆఫ్‌ ఫిలిప్పీన్స్‌కు మూడో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు రామన్‌ మెగసెసె. ప్రెసిడెంట్‌గా ఉన్నంత కాలంలో అమెరికాతో స్నేహ సంబంధాలను నెరపిన రామన్‌ ఫిలిప్పీన్స్‌ను అభివృద్ధి పథంలో నడిపించాడు. కోల్డ్‌‌వార్‌ సమయంలో, దక్షిణాసియాలో కమ్యూనిజానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ‘సౌత్‌ ఏషియా ట్రీటీ ఆర్గనైజేషన్‌’ను స్థాపించి దక్షిణాసియా దేశాలన్నింటిని ఒక్క త్రాటిపై నడిపించారు.

మెగసెసె అవార్డు

[మార్చు]

ఫిలిప్పీన్స్‌లో శాంతి స్థాపనకై తన జీవితాన్ని దారబోసిన రామన్‌ మెగసెసె 1957 మార్చి 17వ తేదీన ఒక విమాన ప్రమాదంలో మృతిచెందాడు. ప్రజాసేవకు తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యిక్తి రామన్‌ మెగసెసె సేవకు గుర్తింపుగా ఆయన పేరుతో ఒక అవార్డును ప్రవేశపెట్టారు. 1957 ఏప్రిల్‌ మాసంలో న్యూయార్క్‌లోని ‘రాక్‌వెల్‌ బ్రదర్స్‌’ ఫౌండేషన్‌ వారు ఈ అవార్డును నెలకొల్పారు. ప్రతి సంవత్సరం, వివిధ రంగాల్లో కృషి చేసిన ఆసియాకు చెందిన ప్రముఖులకు ఈ అవార్డును బహుకరిస్తారు. ఆసియా నోబెల్‌గా పేరొందిన ఈ అవార్డును ప్రభుత్వ సర్వీసులు, కమ్యూనిటీ లీడర్‌షిప్‌, జర్నలిజం, లిటరేచర్‌, శాంతి తదితర రంగాలలో సేవచేసినవారికి ఇస్తారు. తన జీవితకాలం మొత్తం శాంతికోసం పోరాటం చేసిన రామన్‌ మెగసెసె యువ రాజకీయ నాయకులకు ఆదర్శవాదిగా పేరు గాంచాడు.

మూలాలు

[మార్చు]