రామరాజ్యంలో రక్తపాతం

వికీపీడియా నుండి
(రామరాజ్యంలో రక్త పాతం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రామరాజ్యంలో రక్త పాతం
(1976 తెలుగు సినిమా)
Ramarajyamlo Raktha Patham (1976).jpg
సినిమా పోస్టర్
తారాగణం కృష్ణ
కూర్పు కోటగిరి గోపాలరావు
నిర్మాణ సంస్థ రామ విజేత ఫిల్మ్స్
భాష తెలుగు

రామరాజ్యంలో రక్తపాతం పద్మాలయా నిర్మాణ సంస్థ పతాకంపై నిర్మించగా కృష్ణ నటించిన 1975 నాటి చలనచిత్రం.

విడుదల[మార్చు]

ప్రచారం[మార్చు]

రామరాజ్యంలో రక్తపాతం సినిమా భారతదేశం ఎమర్జెన్సీ సమయంలో విడుదలైంది. ఎమర్జెన్సీ రోజుల్లో సినిమాల్లో రక్తం, మద్యం చూపించరాదన్న నియమనిబంధనలు వచ్చాయి. దాంతో భారతదేశంలో నిర్మించి, విడుదల చేసిన సినిమాల్లో మద్యాన్ని చూపించకుండా, ఫైట్ల సమయంలో కూడా రక్తానికి తావులేని ముష్టిఘాతాలతో జాగ్రత్తపడేవారు. అటువంటి రోజుల్లో టైటిల్లోనే రక్తపాతం ఉన్న సినిమా కాబట్టి ప్రచారంలో రక్తపాతం అన్న పదాన్ని చూపించకూడదన్న నియమం విధించారు. అప్పటికే పోస్టర్లు ప్రింట్ అయిపోయివుండడంతో వాటిలో పేరులోవున్న రక్తపాతం అన్న పదంపై రక్తపాశం అన్న అక్షరాలతో ఉన్న స్లిప్పులు అతికించి ప్రచారం కొనసాగించారు.[1]

మూలాలు[మార్చు]