Jump to content

రామరాజ్యంలో సప్తాంగాలు

వికీపీడియా నుండి
  • రామరాజ్యం సప్తాంగయుతం
  • రాజ్యానికి ఉండవలసిన లక్షణాలు

రాజ్యానికి ఏడు అంగాలుఉంటాయి అని శుక్రనీతిలో చెప్పబడింది.

"స్వామ్యమాత్యసుహృత్కోశరాష్ట్రదుర్గబలానిచ సప్తాంగముచ్యతే." - శుక్రనీతి -1-61 అవి

  1. రాజు
  2. మంత్రి
  3. స్నేహితుడు
  4. కోశాగారంం
  5. రాష్ట్రం
  6. కోట
  7. సైన్యం.

ఈ ఏడు రక్షింపబడినప్పుడు రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. ఈ ఏడు రామునికాలంలో చక్కగా పరిరక్షింపబడ్డాయి కాబట్టి అది రామరాజ్యంగా ప్రసిద్దికెక్కింది. రామాయణం లౌకికసాహిత్యంలో అతి ప్రాచీనగ్రంథమే అయినప్పటికీ , ఉత్తమమైన మార్గాన్ని నిర్దేశించడం ద్వారా అది నేటికిని ప్రజలలో నిలిచిపోయియున్నది. అయోధ్యాకాండలో రాముడు భరతునికి ఉపదేశించిన నీతిమార్గం సార్వకాలీనం, సార్వజనీనం. రాముడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ,భరతుడు పదునాలుగు సంవత్సరాలపాటు జటావల్కధారియై మునివృత్తిని అవలంబిస్తూ, నందిగ్రామంలో నివసిస్తూ , రాముని పాదుకలకు అభిషేకం చేసి అయోధ్యానగరాన్ని పరిపాలిస్తాడు. ఇది నిష్కామకర్మకు (ప్రయోజనాన్ని ఆశించకుడా చేసే పని)

రాజు

[మార్చు]

రాజన్ అనే పదం రాజృ దీప్తౌ'బొద్దు పాఠ్యం' అనే ధాతువు నుండి నిష్పన్నమయింది. రంజితాశ్చ ప్రజాస్సర్వాస్తేన రాజేతి కథ్యతే అని మహాభారతం శాంతిపర్వంలో చెప్పబడింది. ప్రజలందరూ అతనిచే సంతోషపెట్టబడతారు కావున అతడు రాజు అని పిలువబడతాడు.రంజయతీతి రాజా అని కూడా దీనికి వ్యత్పత్త్యర్థము. ప్రజలను సంతోషపెటట్డమే రాజుయొక్క ప్రథమకర్తవ్యం. కాబట్టి మంచి పరిపాలనకి ఏమేమి అవసరమో వాటినన్నింటినీ రాజు తప్పక ఆచరించాలి. బాలకాండలో వాల్మీకి దశరథుని రాజ్యపాలనను ఇంద్రుని పాలనలా ఉందని వర్ణిస్తాడు. దశరథుని పాలనలో ఏయే ప్రజలు ఏ విధంగా ఉన్నారో విపులంగా వర్ణిస్తాడు. చక్కటి పరిపాలనకు పురోహితులు ,మంత్రులు అవసరము. రాజ్యనిర్వహణకు కోశాగారం , రాజ్యరక్షణకు సేనాధిపతులు, సైన్యము , దూతలు అవసరము. వీటన్నిటినీ వాల్మీకి ఎంతో వివరంగా వర్ణిస్తాడు.

రాజుకుండవలసిన అర్హతలు

[మార్చు]

రాజ్యంలో అందరూ రాజు కావడానికి అర్హులు కారు. కేవలం పెద్దకుమారుడు మాత్రమే రాజు కాగలడని వాల్మీకి వివరిస్తాడు.

సుతాస్సర్వే రాజ్యే తిష్ఠన్తి భామిని

స్థాప్యమానేషుసర్వేషు సుమహాననర్థో భవేత

తస్మాజ్జ్యేష్ఠే హి కైకేయి రాజ్యతంత్రాణి పార్థివాః

స్థాపయత్యనవతాఙ్గి గుణవత్స్వితరేష్వపి

రాజుకు గుణవంతులైన కుమారు

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]